ఫోటో స్టొరీ: ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో రచ్చ!

Update: 2019-08-03 05:32 GMT
బెంగాలీ భామ త్రిధా చౌదరి తెలుసు కదా? బెంగాలీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత నిఖిల్ హీరోగా నటించిన 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.  త్రిధా మొదట్లో పక్కింటమ్మాయి లాగా కనిపించింది.. అయితే పెద్దగా లాభం లేకపోవడంతో గ్లామర్ గేర్ వేసింది.  ఈ భామ 'మనసుకు నచ్చింది'.. '7' చిత్రాల్లో కూడా నటించింది.  ఈభామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.  రెగ్యులర్ గా ఏదో ఒక హాట్ ఫోటో పోస్ట్ చేస్తూ ఇంటర్నెట్ హీట్ పెంచుతూ ఉంటుంది.

తాజాగా త్రిధ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "ఇప్పుడు నన్నే విషయమూ ఆపడం లేదు.  నాకేం కావాలో నాకు తెలుసు..నేనది సాధిస్తాను.  ఒక్కసారి నేను  ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా అది సాధించి తీరతాను.  మీ సంగతేంటి?"అంటూ ఒక క్వశ్చన్ లాంటి క్యాప్షన్ ఇచ్చింది.  ఇక ఫోటో సంగతి మాట్లాడుకుంటే పారదర్శకంగా ఉండే ఒక  తెలుగు రంగు ఫుల్ స్లీవ్స్ షర్టు వేసుకోవడంతో పటాని పాప స్టైల్ లో బ్లాక్ ఇన్నర్ వేర్ కనిపిస్తూ ఉంది.  రెండు చేతులను పైకెత్తి కళ్ళు మూసుకొని ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. పెదవులపై సన్నని చిరునవ్వు కూడా ఉంది.  ఓవరాల్ గా ఫోటో హాట్ గా ఉంది.

ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "చాలా ప్రెట్టీగా ఉన్నావు".. "కిల్లర్ పోజ్.. సెక్సీ లేడీ".. "స్టన్నింగ్ డ్రెస్".. "హాట్ లుక్ బేబీ" అంటూ పొగడ్తలు కురిపించారు.  ఒక నెటిజన్ మాత్రం త్రిధా తన క్యాప్షన్ లో వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ "నేను అంతే నాకేదైనా కావాలంటే ఇంట్లోవారిని ఏడిపించి మరీ సాధిస్తాను" అన్నాడు.  ఇక త్రిధా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం  'షంషేరా' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.  రణబీర్ కపూర్.. సంజయ్ దత్.. వాణి కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
Tags:    

Similar News