• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: రాజమౌళి...

ట్రైలర్ టాక్: రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి!

By - Tupaki Desk
Update: 2019-12-11 12:21 GMT
తమిళ హీరో కార్తి.. జ్యోతిక తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'దొంగ'.  రియల్ లైఫ్ లో వదిన-మరిది అయిన వీరిద్దరూ 'దొంగ' లో రీల్ అక్క-తమ్ముడు పాత్రల్లో నటిస్తున్నారు. 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు. 'దొంగ' ట్రైలర్ ఈమధ్యే రిలీజ్ అయింది.

సత్యరాజ్ - సీత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒకరు జ్యోతిక.. మరో అబ్బాయి శర్వా కూడా ఉంటాడు. అయితే ఆ కొడుకు చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాడు.  15 ఏళ్లు అవుతుంది.  జ్యోతిక కూడా తన తమ్ముడిని తలుచుకుంటూనే ఉంటుంది.  15 ఏళ్ళ తర్వాత ఆ శర్వా నేనేనంటూ కార్తి వస్తాడు.  ఇతడేమో ఒక దొంగ.  చాలా డేంజరస్.. పెద్ద ఫ్రాడ్. మరి నిజంగా ఇతను సత్యరాజ్ కొడుకేనా.. జ్యోతిక తమ్ముడేనా అనేది తెలియదు. కార్తి ఒక సీన్ లో అద్దం ముందు స్వగతం మాట్లాడుతూ "ఎలా ఉందిరా పర్ఫామెన్సు? న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి. ఎవరెవరినో పెడుతున్నారు" అంటూ తమిళ యాసతో కూడిన తెలుగులో ఫన్నీ పంచ్ వేస్తాడు.  ఈ దొంగను తెలివైన అక్క జ్యోతిక నమ్మదు.. "15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయి ఇప్పుడు సడెన్ గా వచ్చి నేనే తమ్ముడు అంటే ఎత్తుకుని ఆడించమంటావా" అంటూ సతాయిస్తుంటుంది.

టీజర్ చూస్తుంటే యాక్షన్.. సెంటిమెంట్.. కామెడీ... అన్నీ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ తరహాలో ఉంది.  కార్తి-జ్యోతిక అక్క తమ్ముడు కాంబినేషన్.. సత్యరాజ్ లాంటి నటుడు.. సినిమాకు ప్లస్ గా కనిపిస్తున్నాయి. సినిమా ఎలా ఉంటుందో తర్వాత తెలుస్తుంది కానీ అంతలోపు ఈ తమిళం దొంగ ట్రైలర్ ను చూసేయండి.

Full View

Tags:    
  • Trailer Talk 
  • Donga 
  • Mixed 
  • All Elements 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS