యువహీరో స్వయంకృతం అనుకోవాలా?
పరాజయాలు సహజం. ఏ రంగంలో అయినా అవి ఉంటాయి. అయితే వైఫల్యానికి కారణాలేమిటో విశ్లేషించుకుని సక్సెస్ బాటలోకి వెళ్లడం ఎలానో తెలియాలి. అయితే ఆ యంగ్ హీరో మాత్రం ఇంకా తనని తాను విశ్లేషించుకోలేని స్థితిలో ఉన్నాడట. ప్రణాళికలో మార్పు తేలేక చతికిలబడుతున్నాడని తాజా సన్నివేశం చెబుతోంది.
దీనివల్ల తనకు అవకాశం ఇవ్వాలనుకున్న నిర్మాతలు వెనకడుగు వేస్తుండడం ఇటీవల చర్చకు వచ్చింది. టాలీవుడ్ లో ఓ బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో సొంతంగా బ్యానర్ ప్రారంభించి సదరు హీరోతో సినిమా చేయాలని అనుకున్నారు. తానే నిర్మాతగా కొనసాగాలని ఓ యువదర్శకుడితో మంతనాలు సాగించాడు. కథ రెడీ అయ్యింది. కానీ ఇంతలోనే ప్లాన్ ఛేంజ్ అయ్యింది. ఆ యంగ్ హీరో పై నమ్మకం లేక ప్లాన్ డ్రాప్ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సదరు హీరోకి ఇప్పుడు మార్కెట్ లేకుండా పోయింది. వరుస ఫ్లాపులతో వచ్చిన ముప్పు ఇది. ప్రతిభావంతుడే అయినా ఇలా ఎందుకైంది? అంటే ఎంపికల్నే తప్పు పడుతున్నారు. రైట్ టైమ్ లో స్వయంకృషితో ఎదిగిన నాని.. నిఖిల్ తరహాలో తెలివైన ఎంపికలతో దూసుకెళ్లలేకపోయాడన్న విశ్లేషణ సాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ వైఫల్యాలతో ఆ యంగ్ హీరో మార్కెట్ దాదాపుగా సున్నా అయిందని విశ్లేషించాక ఆ హీరో కం నిర్మాత సినిమాని మిడిల్ డ్రాప్ అయ్యాడట. సదరు యంగ్ హీరోతో సినిమా చేయడానికి ఎవరూ సాహసించడం లేదు మరి.