• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప వేదిక నుండి...

పుష్ప వేదిక నుండి టాలీవుడ్ తరపున వార్నర్ కు థ్యాంక్స్

By - Tupaki Desk
Update: 2021-12-13 07:46 GMT
ఈమద్య కాలంలో తెలుగు సినిమాల స్థాయి చాలా పెరిగింది. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలు అయ్యింది. తెలుగు లో విడుదల అయిన ప్రతి ఒక్క సినిమా గురించి బాలీవుడ్ వర్గాల వారు చర్చించడం.. రీమేక్ చేయడం లేదా డబ్బింగ్‌ చేయడం చేస్తున్నారు. స్టార్‌ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా ఒక మోస్తరు క్రేజ్‌ ఉన్న హీరోల సినిమాలు చిన్న హీరోల కంటెంట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా బాలీవుడ్‌ వర్గాల వారిని ఆకర్షిస్తూనే ఉంది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ వల్ల తెలుగు సినిమాల గురించి.. తెలుగు స్టార్స్ గురించి మొత్తం ప్రపంచం తెలుస్తోంది. ఈమద్య కాలంలో ఆయన తెలుగు సినిమా స్టార్స్ ను ఇమిటేట్‌ చేస్తూ చేసిన రీల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటికే పలువురు హీరోల పాటలను మరియు ఫైట్స్ డైలాగ్స్ ను చెప్పిన డేవిడ్ వార్నర్‌ తాజాగా పుష్ప పాటతో మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచంకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఆయన వీడియోలు ఉంటున్నాయని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి తరపున.. టాలీవుడ్‌ తరపున వెంకీ కుడుముల పుష్ప ప్రీ రిలీజ్ వేదిక నుండి డేవిడ్‌ వార్నర్ కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. తెలుగు సినిమా ల గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న డేవిడ్‌ వార్నర్ మొన్నటి వరకు సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో ఉన్నాడు. ఆయన ఈమద్య కాలంలో ఆ జట్టుకు దూరం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే డేవిడ్ వార్నర్ కొత్త జట్టులోకి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

టిక్ టాక్ వీడియో లు మరియు ఇన్ స్టా గ్రామ్‌ రీల్స్ లో డేవిడ్‌ వార్నర్ తన ఫ్యామిలీ తో కలిసి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఫన్నీ వీడియోలు.. సీరియస్ వీడియోలు.. మెసేజ్‌ వీడియోలు.. బ్రాండ్ ప్రమోట్‌ వీడియో లు ఎన్నో చేస్తూ ఉంటాడు. అలాంటి  డేవిడ్‌ వార్నర్‌ కు పుష్ప ప్రీ రిలీజ్ వేదిక నుండి టాలీవుడ్‌ తరపున థ్యాంక్స్ చెప్పడం అనేది ఖచ్చితంగా ఆయన్ను గౌరవించడం అనడంలో సందేహం లేదు. ఐపీఎల్‌ లో ఆయన రాబోయే సీజన్ లో హైదరాబాద్‌ తరపున ఆడబోవడం లేదు అనే నిజం అభిమానులకు కాస్త చేదుగా ఉంది. ఆయన ఏ జట్టుకు ఆడినా కూడా ముందు ముందు రోజుల్లో కూడా ఆయన ఇండియన్ సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Tags:    
  • David Warner Pushpa 
  • David Warner 
  • OoAntavaOoOoAntava 
  • PushpaTheRiseOnDec17 
  • Samantha 
  • PushpaMASSivePreReleaseParty 
  • Alluarjun 

Similar News

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS