కామెంట్: కొత్తవి ఎందుకు రావట్లేదంటారూ!!
నిజమే కదా.. ఏ హీరో సినిమా చూసినా కూడా.. ఈ కథ ఎక్కడో విన్నట్లుందే.. ఎక్కడో చూసినట్లుందే.. ఎప్పుడో ఎవరో చేసేశారే.. అనే ఫీలింగ్ తప్పిస్తే.. అసలు కథ అనేది కొత్తగా ఉండట్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల ఫీలింగ్ ఇదే. కొత్త కొత్తగా వస్తున్న కొత్త దర్శకుల సినిమాల నుండి.. సీనియర్ స్టార్ రైటర్లు డైరక్టర్లు తయారు చేసిన సినిమాల వరకు.. ఒకేలా ఉంటున్నాయి. ఒక్కరంటే ఒక్క హీరో కూడా అదిగో నేను కొత్త కథతో వచ్చాను అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటారు?
తెలుగు సినిమాల పేర్ల ప్రస్తావన ఎందుకులే కాని.. బాలీవుడ్ లో వచ్చిన బజరంగీ భాయ్ జాన్.. పీకూ.. తీన్.. ఇలా చాలా సినిమాలు స్టీరియోటైప్ ను బ్రేక్ చేస్తూ.. మరో ప్రక్క కమర్షియల్ గా ఎంటర్టయిన్ చేస్తూ.. విజయాలు సాధించేశాయి. మన దగ్గరేమో హీరో అంటే.. ఒక జోక్ వేసి పక్కనున్న స్నేహితులను చెంప మీద కొట్టడం.. లేదంటే హీరోయిన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టడం.. తరువాత ఆమెతో రొమాన్స్.. విలన్లకు భారీ డైలాగులు చెప్పడం.. వాళ్ళేమో పనేం లేనట్లు రేపులూ గొడవలే పని అన్నట్లు బిహేవ్ చేయడం.. ఇదే సోది. ఒక ఫ్యామిలీ సినిమాలు అంటారా.. అయితే హీరో త్యాగం లేదంటే హీరోయిన్ త్యాగం.. దానిని గొప్పగా రెండు ఏడుపు పాటల్లో చూపించడం.. చివరికి వారిని కలపడం. అదే సోది. సేమ్ సొల్లు. సినిమాలు హిట్టయ్యి కోట్లకు కోట్లు వచ్చేస్తున్నాయి కాని.. ఈ కథ స్థాయి మాత్రం పెరగట్లేదు. హీరో అడుక్కుతినే క్యారెక్టర్ చేసినా కూడా సినిమా ఆడుతుందని ఒక డబ్బింగ్ సినిమా ప్రూవ్ చేసింది. కనీసం ఇప్పుడైనా ఫేక్ హీరోయిజం వదిలేసి ఏమన్నా రియలిస్టిక్ కథలను ఎవరైనా స్టార్ హీరోలు ఎంచుకుంటారేమో చూడాలి.
పెద్ద హీరోలైతే.. కొత్త కథలు ఎంచుకోవడానికి చెబుతున్న ఏకైక సాకు ఏంటంటే.. మా ఫ్యాన్స్ ఒప్పుకోరు. వారి కోసం వారికి నచ్చే సినిమాలే చేస్తున్నాం అంటున్నారు. చిన్న హీరోలైతే.. మేం అలాంటి కథలు చేస్తే కనీసం రిలీజ్ చేయడానికి డేట్లు కూడా దొరకవు అని చెబుతున్నారు. ఇక దర్శకులు అయితే.. కొత్త కథను తయారు చేయాలంటే కొత్తగా ఆలోచించాలని బాధపడతారేమో తెలియదు కాని.. ఏదన్నా డివిడి చూసి సీన్లు ఎత్తేయడానికే ఎక్కువ ప్రిఫరెన్సు ఇస్తున్నారు. ఎట్లీస్ట్ నిర్మాతలు బెటర్. కొత్త కథలను తీయడానికి రెడీగానే ఉన్నారు. కాని వారికి ఆ కథను ఇచ్చేదెవరు? ఆ కథ విని డేట్లిచ్చేదెవరు?