వాళ్ళ వంటకీ పంట పండుతుంది
సాధారణంగా తెలుగు సినిమాలలో హీరో యొక్క హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడానికి వాళ్ళ ప్రొఫెషన్ ని ఆయుధంగా వాడుకుంటారు. మధ్యతరగతి జీవితాన్ని మోస్తూ కుటుంబాన్నో, హీరోయిన్నో కాపాడుతూ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. దుమ్ము దులిపే పోలీస్ ఆఫీసర్ గా వస్తే మాస్ పిచ్చెక్కిపోతారు. పనీ పాటా లేని పోకిరిగా తిరిగితే యూత్ ఎట్రాక్ట్ అవుతారు. అయితే రొటీన్ గా కాకుండా హీరోని వంటవాడిగా మార్చి ఆ ప్రొఫెషన్ ని సైతం ఎలివేషన్ కి వాడుకోవడం విశేషం.
త్రివిక్రమ్ కథను అందించిన చిరునవ్వుతో సినిమాలో హీరో వేణు వంటవాడి పాత్రలో కనిపించి "ఎవరికైనా రిటైర్మెంట్ వుంటుంది గానీ తినేవాడికి వండేవాడికి రిటైర్మెంట్ ఉండదనే' పంచ్ డైలాగులతో మెప్పించాడు. ఆ తరువాత మళ్ళీ ఆ పాత్రలు కనిపించకపోయినా ఈ మధ్య విడుదలై హిట్ బయటపట్టిన మూడు సినిమాలలో హీరో వంటవాడిగా కనిపించడం విశేషం.
త్రివిక్రమ్ 'అ..ఆ..'లో మరోసారి తన హీరో నితిన్ ని చెఫ్ గా పరిచయం చేశాడు. రీసెంట్ సంచలనం పెళ్లిచూపులు సినిమాలో హీరో వంటవాడిగా ఫుడ్ ట్రక్ పెట్టి రాణిస్తాడు. మంచి వంటకం మంచి పెయింటింగ్ లాంటిది అనే డైలాగ్ లు కూడా పడ్డాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య తన ప్యాషన్ ప్రొఫెషన్ గా మారి చీఫ్ చెఫ్ గా అవతారమెత్తుతాడు. ఇలా వంటనికూడా కాసుల పంటగా మార్చుకునే ప్రయత్నం విజయవంతమవుతుంది. రేపు ఏ కుర్రాడన్నా ఫలానా సినిమాలో హీరోలా వంట చేసి కోట్లు సంపాదిస్తానన్న డైలాగ్ పడినా ఆశ్చర్యపోనవసరరం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/