'పాన్ ఇండియా స్టార్' అనిపించుకుంటారా..?
సౌత్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా మీద దృష్టి సారించారు. అందరూ బహు భాషా చిత్రాలు చేస్తూ మార్కెట్ విస్తరించుకునే పనిలో పడ్డారు. 'బాహుబలి' సినిమాతో సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిన ప్రభాస్ 'పాన్ ఇండియా స్టార్'గా మారిపోయాడు. కన్నడ హీరో యష్ 'కేజీయఫ్' మూవీతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు అందరి కళ్ళు ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ ల మీదే ఉన్నాయి.
టాలీవుడ్ నుంచి నెల రోజుల వ్యవధిలో 'RRR' 'పుష్ప' వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తారక్ - చరణ్ లు హీరోలుగా నటించిన 'ఆర్.ఆర్.ఆర్' 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వచ్చే వారం అంటే డిసెంబర్ 17న సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' రిలీజ్ కానుంది.
RRR విడుదలకు ఇంకా నెల రోజుల సమయం వుండగానే రాజమౌళి ప్రమోషన్స్ ముమ్మరం చేసి సినిమాపై బజ్ తీసుకొచ్చారు. ట్రైలర్ ను యూట్యూబ్ తో పాటుగా థియేటర్లలో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించారు. అలానే ముంబై - బెంగుళూరు - చెన్నై - హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెంట్స్ పెడుతూ హడావుడి చేస్తున్నారు.
అలానే 'ఆర్.ఆర్.ఆర్' లో బాలీవుడ్ స్టార్స్ ఉండటం కూడా హిందీ మార్కెట్ కు బాగా ప్లస్ అయింది. ట్రైలర్ రిలీజ్ తో బీ టౌన్ జనాలు రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల గురించి మాట్లాడుకుంటున్నారు. వీరికి ఎలాగూ జక్కన్న అండ ఉంది కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే మరో వారం రోజుల్లో రాబోతున్న 'పుష్ప' సినిమా ప్రమోషన్స్ దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు సాంగ్స్ - ట్రైలర్ అంటూ హల్ చల్ చేసినా.. హిందీ రిలీజ్ విషయంలో మాత్రం సందడి కనిపించడం లేదు. విడుదల దగ్గర పడుతున్నా నిర్మాతలు ఇంతవరకు బాలీవుడ్ జనాల దృష్టిని ఆకర్షించడానికి ఒక్క ప్రెస్ మీటింగ్ కూడా నిర్వహించలేదు.
హిందీ రైట్స్ విషయంలో జరిగిన గందరగోళం వల్ల అసలు 'పుష్ప' సినిమా అక్కడ థియేట్రికల్ రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు మొన్నటి వరకూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకుంటుండగా.. అల్లు అర్జున్ సినిమా హిందీ ట్రైలర్ తెలుగు వెర్షన్ తో పోలిస్తే ఒక్కరోజు ఆలస్యంగా విడుదలై అభిమానులు నిరాశ పడేలా చేసింది. మిగతా భాషలతో పోలిస్తే అక్కడ పెద్దగా సందడి లేదు.
అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ లో ప్రతిబింబిస్తుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. కాకపోతో నిర్మాతలు దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేయడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ బాధ్యత తీసుకోడానికి పుష్ప చిత్రంలో హిందీ స్టార్స్ కూడా ఎవరూ లేరు. అక్కడ బజ్ క్రియేట్ అయి మంచి ఓపెనింగ్స్ రావాలంటే ఈ వారంలో ముంబైలో ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. మేకర్స్ ఈ క్రమంలో హిందీ ప్రమోషన్స్ మీద ఫోకస్ పెడతారేమో చూడాలి. ఏదేమైనా 'ఆర్.ఆర్.ఆర్' 'పుష్ప' సినిమాలతో తారక్ - చరణ్ - బన్నీ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవాలని టాలీవుడ్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాలు వీరి ముగ్గురిని 'పాన్ ఇండియా స్టార్స్' గా మారుస్తాయా? లేదా? అనేది చూడాలి.