ఏపీలో టిక్కెట్టు సంక్షోభం తెలంగాణకు ప్లస్!
ఏపీలో టిక్కెట్టు సంక్షోభం తెలంగాణకు ప్లస్ కానుందా? అంటే అవుననే విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కోర్టు తీర్పు ప్రకారం టిక్కెట్టు ధరలు పెంచుకునే వెసులుబాటు ఉన్నా అంతకుముందే కలెక్టర్ల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కానీ కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలా చేస్తారని భావించడం లేదు. ఇది పుష్ప కు ఊహించని పిడుగు.
అయితే ఏపీలో సన్నివేశానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందిస్తోంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది.
డిసెంబర్ 17న విడుదలైన పుష్ప కోసం అదనపు 5వ ప్రదర్శనను అనుమతించడమే కాకుండా రూ.250 ధరకు టికెట్ ని విక్రయించడానికి ప్రభుత్వం అనుమతినిస్తూ జీవోని జారీ చేసింది. ఇది పెద్ద బడ్జెట్ సినిమాలకు వరం. అటు ఏపీలో మాత్రం ప్రభుత్వం టిక్కెట్టు విషయంలో అస్సలు దిగి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని హైకోర్టు పాత టిక్కెట్ ధరలపై ముందుకు సాగాలని ఆదేశించినా అధికారుల అనుమతుల్లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.
కారణం ఏదైనా కానీ ఏపీలో పుష్పకు ఆశించిన కలెక్షన్లు సాధ్యం కాదని అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఈ పెరిగిన టిక్కెట్ ధరలు పుష్పకు భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. టాక్ బావుంటే చాలు పుష్ప రికార్డులు మోతెక్కిస్తుంది.
ఇంతకుముందు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసింది. మొదటి రోజు తెలంగాణలో దాదాపు 5 కోట్లు వసూలు చేయగా.. మొదటి రోజు ఆంధ్ర ప్రాంతంలో 13 కోట్లు వసూలు చేసింది. ఈసారి వసూళ్ల రేంజ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. పుష్ప అన్ని భాషలు కలుపుకుని దాదాపు 500 కోట్లు వసూలు చేయాలన్న టార్గెట్ తో బరిలో దిగింది.
హిందీ మార్కెట్ నుంచి అమెరికా నుంచి భారీ వసూళ్లను ఆశిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్ గా నటిస్తున్నారు. శ్రీవల్లి అనే గిరిజన యువతిగా రష్మిక నటించింది. అలాగే సునీల్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెరుపులు మెరిపించనున్నాడు.