ఎఫ్3 గురించి ఆ రెండు వార్తలు పుకార్లే
గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ఎఫ్2 కు ఇటీవలే సీక్వెల్ ఎఫ్3 మొదలైంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం రవితేజ మరియు గోపీచంద్ లతో అనీల్ రావిపూడి చర్చలు జరిపాడనే వార్తలు వచ్చాయి. సీటీమార్ సినిమా సెట్ లో గోపీచంద్ తో అనీల్ చర్చలు జరిపారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఎఫ్ 3 లో కనిపించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
గోపీచంద్ వార్తలు వస్తున్న సమయంలోనే రవితేజతో కూడా అనీల్ రావిపూడి చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరిగింది. రవితేజ ఎఫ్ 3 లో అంటూ ఈ ఏడాది ఆరంభం నుండే వార్తలు వచ్చాయి. కాని ఇటీవల ఆ వార్తలు ప్రముఖంగా రావడంతో ఎఫ్ 3 లో ఆ హీరో కూడా ఉన్నాడేమో అనుకున్నారు. ఈ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా ఉంటారని భావిస్తున్న సమయంలో మేకర్స్ అవన్ని కూడా పుకార్లే అంటూ కొట్టి పారేశారు.
ఎఫ్ 3 సినిమా లో కేవలం ఇద్దరు హీరోలు వారు వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు మాత్రమే అని మరో హీరో ఈ సినిమాలో కనిపించబోడు అంటూ దిల్ రాజు ప్రొడక్షన్ టీం నుండి అనధికారిక క్లారిటీ వచ్చేసింది. ఒక హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా మరో హీరోయిన్ విషయంలో చర్చ జరుగుతోంది. మెహ్రీన్ కాకుండా మరెవ్వరైనా ఈ సినిమాలో కనిపించబోతున్నారా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్ కు తీసుకు వెళ్లబోతున్నారు.