ఇండస్ట్రీ ఎవరనైనా మార్చేస్తుందంటే ఇదేనేమో..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. స్టార్ స్టేటస్ అందుకున్న వాళ్లు ఒక్కసారిగా కిందకి పడిపోవచ్చు.. లక్ కలిసొస్తే ఒక్క దెబ్బతో స్టార్ గా మారిపోవచ్చు. అలానే సినీ ప్రముఖుల బిహేవియర్ కూడా స్టార్ డమ్ ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ ఫేమ్ లేనప్పుడు ఒకలా క్రేజ్ వచ్చిన తర్వాత మరోలా ప్రవర్తించే వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో ఒకరు సక్సెస్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా మరిపోయాడని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా అడుగుపెట్టినానని చెప్పుకునే ఓ యువ హీరో.. టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆన్ స్క్రీన్ పెరఫార్మన్స్ తో పాటు ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. నెపోటిజం హీరోలకు పోటీగా నిలవడమే కాకుండా, నెపోటిజం అంటే అసలు పడని హీరోగా చెప్పుకున్నాడు. ఇక ఆయన తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటే చిరాకు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చే ఆ యువ హీరో.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. మాట్లాడితే తన ఇంటి పేరు చెప్పుకుని పోస్టులు పెట్టడం, ప్రచారాలు చేయించుకోవడం చేస్తున్నాడు. ఇప్పుడు తమ్ముడు కూడా ఓ హిట్ రావడంతో ఫామిలీ నేమ్ నే అందరు మాట్లాడుతున్నారు . ఇండస్ట్రీ ఎవరనైనా మార్చేస్తుందంటే ఇదేనేమో అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.