దీపావళికి ఈ భారీ చిత్రం విడుదల.. జనాలు వస్తారా?

Update: 2020-10-19 06:30 GMT
సంక్రాంతి, దసరా, డిసెంబర్, సమ్మర్ సీజన్లలో కొత్త సినిమాలతో థియేటర్లు ఫుల్ స్వింగ్ లో ఉంటాయి. జనాలు ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. కానీ కరోనా వల్ల ఇప్పుడు అందరి ఆశలు తలకిందులయ్యాయి. థియేటర్లు తెరిచినా సవాలక్ష నిబంధనలు, కరోనా నిబంధనలతో అటు వైపు వెళ్లే నాథుడే లేకుండా పోయాడు.

సినిమా అంటే పిచ్చిగా చూసే జనాలందరినీ ఇప్పుడు కరోనా వచ్చి భయపెడుతోంది. థియేటర్లలో మళ్లీ మామూలుగా సినిమా చూడాలని ఆశపడడం తప్పితే ఇప్పుడు చూసే దైర్యం ఎవరూ చేయడం లేదు. ఇక నిర్మాతలు కూడా జనాల భయాన్ని గ్రహించి ఏ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం లేదు. వ్యాక్సిన్ వస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు.

దసరా వచ్చిదంటే ఖచ్చితంగా టాలీవుడ్ లో పెద్ద సందడి ఉండేది. ఓ రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేవి. దీపావళి మన అగ్రహీరోలు ఖర్చీఫ్ లు వేసేవారు. ప్రజలకు దసరా , దీపావళి సెలవులు ఇస్తారు కాబట్టి థియేటర్లన్నీ హౌస్ ఫుల్ గా నిండేవి. కళకళలాడేవి.కానీ ఇప్పుడు కరోనా ధాటికి ఈ దసరా, దీపావళి సీజన్లు తుడిచిపెట్టుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

 మరో వారం రోజుల్లోని ఈ దసరాకు ఏ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ వచ్చే నెల నవంబర్ నాటికి కొన్ని హాలీవుడ్ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించాలని సినీ ఇండస్ట్రీ యోచిస్తోంది.

ఈ క్రమంలోనే హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ‘టెనెట్’ చిత్రాన్ని దీపావళికి ఖచ్చితంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. నవంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా రెవెన్యూ షేర్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు , ఎగ్జిబ్యూటర్లకు మధ్య సంధి కుదిరినట్టు సమాచారం.  ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు కూడా వదిలారు. సో ఈ దీపావళికి ఈ సినిమాతో మళ్లీ సినిమా ఇండస్ట్రీ ఊపిరిపోసుకుంటోంది. మరి జనాలకు థియేటర్లకు వస్తారా? రారా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News