జూలై చివరి వారం నుంచి థియేటర్లకు క్యూ కట్టే సినిమాలు ఇవే..!
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. థియేటర్స్ మూతబడి ఉండటంతో ఏప్రిల్ - మే - జూన్ నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అనేక సినిమాలు వెనక్కి వెళ్ళిపోయాయి. అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకోడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఇప్పటికే తెలంగాణాలో 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లకు పర్మిషన్ ఇవ్వగా.. రేపు జూలై 8 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అలానే టికెట్ రేట్ల విషయంలో పెద్ద సినిమాలకు ఊరట కలిగించేలా సరికొత్త జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
'వకీల్ సాబ్' సినిమా సమయంలో ఇష్టమొచ్చిన విధంగా టికెట్ ధరలను పెంచడాన్ని నిరోధిస్తూ ఏపీ సర్కార్ ఓ జీవో జారీ చేసింది. అయితే కోవిడ్ నేపథ్యంలో టికెట్ రేట్లపై మరోసారి పునరాలోచించాలని కోరడంతో.. కొత్త జీవో ఇచ్చారు. సినిమా టికెట్ రేట్లు పెంచడం.. తగ్గించడం అనేవి సందర్భానుసారంగా ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయనే విధంగా ఈ జీవో ఉంది. అంటే సినిమా మేకర్స్ కోరితే పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ సినిమాలను థియేటర్లలోకి తీసుకురాడానికి నిర్మాతలు త్వరపడుతున్నారని తెలుస్తోంది. ముందుగా కరోనా ప్రభావంతో వాయిదా పడిన 'లవ్ స్టోరీ' 'టక్ జగదీష్' 'విరాట పర్వం' 'సీటీమార్' 'SR కళ్యాణమండపం' 'రిపబ్లిక్' వంటి సినిమాలను రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమకథా చిత్రం ''లవ్ స్టోరీ''. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా ఉదృతి కారణంతో వాయిదా వేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జూలై నెలాఖరున రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఏపీలో థియేటర్లకు అనుమతి వచ్చింది కాబట్టి అందరి కంటే ముందుగా జూలై 30న 'లవ్ స్టోరీ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని టాక్ వినిపిస్తోంది.
గోపీచంద్ - తమన్నా భాటియా కలిసి నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ''సీటీమార్''. కబడ్డీ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ ను ప్లాన్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నాని - డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ''టక్ జగదీష్''. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా ఏప్రిల్ 23న ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో ఆగస్ట్ సెకండ్ వీక్ లో థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారట. 'పుష్ప' లాక్ చేసి పెట్టుకున్న ఆగస్ట్ 13వ తేదీ స్లాట్ ని 'టక్ జగదీష్' బుక్ చేసుకోవాలని చూస్తున్నారడని సమాచారం.
కిరణ్ అబ్బవరం - ప్రియాంకా జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''SR కళ్యాణమండపం EST.1975''. శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ - రాజులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని.. మంచి ఓటీటీ ఆఫర్స్ వచ్చినా థియేట్రికల్ రిలీజ్ చేయాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాని ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారట.
అక్కినేని అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. సాయి తేజ్ - దేవకట్టా కలిసి చేస్తున్న 'రిపబ్లిక్'.. రానా దగ్గుబాటి - వేణు ఉడుగుల కలయికలో రూపొందుతున్న 'విరాటపర్వం' చిత్రాలను సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 'కేజీయఫ్: చాప్టర్ 2' మరియు బాలయ్య - బోయపాటి ల 'అఖండ' వినాయక చవితి ఫెస్టివల్ సీజన్ ను టార్గెట్ చేయాలని చూస్తున్నారట. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుంటున్నాయి కాబట్టి మేకర్స్ అందరూ త్వరపడాలని చూస్తున్నారని తెలుస్తోంది.