2020 క్రైసిస్: పెండింగ్ సినిమాలు ఇక గ‌ల్లంతేనా

Update: 2020-07-26 04:50 GMT
2020 పంచ్ మామూలుగా లేదు. చైనా వూహాన్ లో డిసెంబ‌ర్ లో మొద‌లైన క‌రోనా నెమ్మ‌ది నెమ్మ‌దిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించి క‌ల్లోలానికి కార‌ణ‌మైంది. అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు వినోద ప‌రిశ్ర‌మ‌ను ఈ పెను విప‌త్తు అత‌లాకుత‌లం చేసింది. ఇది ఇటీవ‌ల వేగంగా విస్త‌రిస్తూ కంటిపై కునుకు ప‌ట్ట‌నీకుండా చేస్తోంది. వినోద ప‌రిశ్ర‌మ‌లో ల‌క్ష‌లాది మంది ఉపాధి కోల్పోయి ధైన్య‌మైన స్థితికి చేరుకున్నారు. నేడో రేపో వ్యాక్సిన్ టీకా అనుకుంటూ కాల‌యాప‌న చేస్తున్నారంతా.

ఏ ప‌రిశ్ర‌మ‌లోనూ సినిమా షూటింగుల్లేవ్.. రిలీజుల్లేవ్. ముఖ్యంగా భార‌త‌దేశంలో సినీప‌రిశ్ర‌మ‌ల‌న్నీ చ‌తికిల‌బ‌డ్డాయి. టాలీవుడ్ పూర్తిగా నీర‌సించిపోయింది. 2020 సంక్రాంతి రిలీజ్ లు మిన‌హాయిస్తే ఆ త‌ర్వాత స‌మ్మ‌ర్ లేదు.. ఉగాది లేదు. మునుముందు ద‌స‌రా .. క్రిస్మ‌స్ ఉన్నా వృథానే. మ‌హ‌మ్మారీ ఇంకా శాంతించ‌క‌పోవ‌డంతో ఇప్ప‌టికే రిలీజ్ కి వ‌స్తాయ‌నుకున్న చాలా క్రేజీ సినిమాలు పూర్తిగా ల్యాబుల‌కే అంకిత‌మ‌య్యాయి.

ఇక బ‌డా సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు అనూహ్యంగా వాయిదా ప‌డిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య‌.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కొత్త సినిమా లాంచ్ ఇప్ప‌టికే పెండింగులో ఉన్నాయి. ఈ ఏడాదికి ఇక లేన‌ట్టేన‌ని ఆ ఇద్ద‌రూ చెప్పేశార‌ట‌. అంటే 2021లోనే హోప్. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ - రాజ‌మౌళి కాంబో ఆర్.ఆర్.ఆర్ ప‌రిస్థితి ఇంకా ధైన్యంగా ఉంది. ఎంత‌గా ఆత్ర‌ప‌డితే అంత‌గా వెన‌క్కి వెళ్లిపోతోంది ప‌రిస్థితి. అల్లు అర్జున్ పుష్ప చిత్రీక‌ర‌ణ వ్యాక్సిన్ వ‌స్తేనే సెట్స్ కెళ్లాల‌న్న ప్ర‌తిపాద‌న బ‌న్ని తెచ్చార‌ట‌. అంటే బిగ్ స్టార్స్ అంతా వేచి చూసే ధోర‌ణి లోనే ఉన్నార‌ని దీన‌ర్థం.

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ - ప్రభాస్ రాధే శ్యామ్ అయినా ఏడాది చివ‌రి నాటికి ప‌నుల‌న్నీ ముగించి రిలీజ్ ల‌కు వ‌స్తాయ‌ని అనుకుంటే అందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. కేవ‌లం కొద్దిరోజుల పెండింగ్ షూట్లు కూడా పూర్తి చేసుకుని రాలేని ప‌రిస్థితి ప‌వ‌న్.. ప్ర‌భాస్ ల‌కు ఉంది. ఇక ఇత‌ర అగ్ర హీరోల ‌సినిమాల ప‌రిస్థితి ఘోరంగానే ఉంది. బాల‌య్య‌- బోయ‌పాటి సైతం సైలెన్స్ అయిపోవ‌డం.. వెంకీ నార‌ప్ప.. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాల‌ అప్ డేట్ లేక‌పోవ‌డం .. చూస్తుంటే ప‌రిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లు సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో- స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాలు ఆ త‌ర్వాత వ‌చ్చిన భీష్మ లేక‌పోతే అస‌లు 2020 క్లీన్ స్వీప్ అయ్యేదే. 2020 క‌ల‌త‌ల్ని క‌న్నీళ్ల‌నే మిగిల్చింది. క‌నీస ఉపాధి లేకుండా చేసిన చీక‌టి సంవ‌త్స‌రంగా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది.
Tags:    

Similar News