సినిమా థియేటర్లపై కేంద్రం మార్గదర్శకాలివీ?
కరోనాతో విధించిన లాక్ డౌన్ ముగిసి ఇప్పుడు దేశంలో అన్ లాక్ ల సీజన్ నడుస్తోంది. ఈ అక్టోబర్ లో కేంద్రంలోని మోడీ సర్కార్ అన్నింటినీ ఓపెన్ చేసేసింది.అక్టోబర్ 15 నుంచి థియేటర్ల ఓపెన్ కు కూడా తాజాగా అన్ లాక్ 5లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా సినిమా థియేటర్లలో పాటించాల్సిన నియమాలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. 50శాతం మించి థియేటర్లలో ప్రేక్షకులను అనుమతిచించవద్దని కేంద్రం పేర్కొంది.
ఇక థియేటర్లలో భౌతిక దూరం పాటించాలని.. ఖాళీగా వదిలేసిన సీట్లపై మార్కింగ్ వేయాలని కేంద్రం సూచించింది.
ఇక అన్నింటికంటే ముఖమైన విషయం.. థియేటర్లలో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని.. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే కరోనా లక్షణాలు లేని ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఇక కరోనా వైరస్ వ్యాపించకుండా బక్స్ ఆఫీస్ టికెట్ కౌంటర్ల వద్ద రోజు మొత్తం ఓపెన్ చేసి రద్దీ తగ్గించాలని కేంద్రం పేర్కొంది.
అయితే కేంద్రం థియేటర్లు తెరవడాన్ని స్వాగించిన సినీ పరిశ్రమ.. 50శాతం సీట్లతోనే నడపాలనడంపై కొందరు ప్రముఖుల పెదవి విరిచారు. కరోనా భయం పోయిందని.. జనాలంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. ఇలాంటప్పుడు మాస్క్ పెట్టుకొని కూడా థియేటర్లలో 50శాతం సీట్లనే నింపాలనడం కరెక్ట్ కాదంటూ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సైతం వ్యాఖ్యానించారు. కానీ కేంద్రం మాత్రం సగం సీట్లతోనే థియేటర్లకు అనుమతులు ఇచ్చింది.