హైద్రాబాద్ లో సినీ ప్రపంచం.. వెలుస్తున్న కొత్త నగరాలు!
అమెరికాాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ టైంలో అక్కడికి సింగిల్ జర్నీయే రిస్క్. మరి, సినిమాా యూనిట్ మొత్తం వెళ్లాలంటే.. హైలీ రిస్క్. మరేం చేయాలి? ఆ దేశాన్నే మన దగ్గర దించేస్తే పోలా..?! ఇప్పుడు ఫిల్మ్ మేకర్లు ఇదే ఆలోచన చేస్తున్నారు. అనుకున్నదే తడవుగా స్పెషల్ ఆర్టిస్టులతో ప్లాన్ చేసి, అడవి నుంచి అమెరికా దాాకా.. పల్లె నుంచి పట్నం దాకా.. అవసరమైన ప్రతీ ఊరిని హైదరాబాద్ లో దించేస్తున్నారు. ఇప్పుడు భాగ్యనగరం చుట్టూ ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాాయి.
ఇటలీ వచ్చేసింది..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. లాక్‌డౌన్‌కి ముందు అక్కడికెళ్లి షూటింగ్ చేసింది యూనిట్. కానీ.. కరోనా పరిస్థితుల్లో ఈ ప్రయాణం అంత సేఫ్ కాదనే నిర్ణయానికి వచ్చేసి, ఇటలీ సెట్‌ని ఇక్కడే వేశారు. 1970 కాలంలో సాగే ఈ పీరియాడిక్ లవ్‌స్టోరీకి తగినట్టుగా చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి యూరప్ హౌస్ ఇంటీరియర్ సెట్‌ని డిజైన్ చేశారు.
ఆచార్య ఆలయం..
కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో ‘ధర్మస్థలి’ అనే ఊరు ఉంటుంది. ఈ ఊళ్లో పురాతన గుడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి వెళ్లి షూట్ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదంటూ హైదరాబాద్ లోనే సెట్ వేశారు. 16 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో భారీ సెట్ వేసి షూట్ చేస్తున్నారు. ఇదేరీతిలో రజనీ కాంత్ కోసం ఏకంగా ఒక ఊరినే నిర్మించారు. ఈ సూపర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. అంటే.. పెద్దన్నయ్య అని అర్థం. ఈ చిత్రం కోసం తమిళనాడు ఊరి సెట్ వేశారు. ప్రస్తుతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు రజనీ.
నగరంలో అడవి..
దేశవిదేశాలు, నగరాలు, పల్లెలు మాత్రమే కాకుండా.. అరణ్యం కూడా హైదరాబాద్ బాట పట్టింది. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. దీంతో.. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎక్కువ శాతం చిత్రీకరణ ప్లాన్ చేసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత యూనిట్ అక్కడికెళ్లింది. అయితే.. నలుగురికి కరోనా రావడంతో వెనక్కి తిరిగొచ్చేశారు. అయితే.. షూటింగ్ డిలే కావొద్దనే ఆలోచనతో నగర శివారులో
అడవి సెట్ వేసుకొని షూటింగ్ చేస్తున్నారు. కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి మారేడుమిల్లి వెళ్లాలనుకుంటున్నట్టు సమాచారం.
హైద్రాబాద్ లో బంగారు గనులు..
కోల్‌కతా నగరాాన్ని కూడా భాగ్యనగరానికి తెచ్చారు మూవీ మేకర్స్. ‘నాని’ నటిస్తున్న మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. కథ డిమాండ్ మేరకు ఎక్కువ శాతం కోల్‌కతాలో షూట్ చేయాలి. అయితే.. కరోనా పరిస్థితుల్లో రిస్క్ ఎందుకులే అని.. కోల్‌కత్తా సెట్ వేశారు. ఇదే విధంగా ముంబైని హైదరాబాద్ తీసుకొచ్చారు ‘ఫైటర్’. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి ముంబై కీలకం. ఇదే విధంగా.. యశ్ హీరోగా సంచలన విజయం నమోదు చేసుకున్న ‘కేజీఎఫ్’ చిత్రం షూటింగ్ కూడా హైదరాబాద్ లో సాగుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్ కోసం బంగారు గనుల సెట్ ను హైదరాబాద్ లో వేశారు.
ఏపీలోని ఏలూరు కూడా..
సాయిధరమ్ తేజ్ పొలిటికల్ టచ్ ఉన్న ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏలూరిని తలపించే సెట్ వేశారు. ప్రస్తుతం ఏలూరులోనే చిత్రీకరణ సాగుతుండగా.. తర్వాతి షెడ్యూల్ ఈ సెట్‌లో మొదలు పెడతారట. ఇక, కల్యాణ్ దేవ్ ‘కిన్నెరసాని’ని మదనపల్లిలో షూట్ చేశారు. ఇందులో హీరో ఇంటి సన్నివేశాలను మదనపల్లిలో తీయగా.. కొనసాగింపు సన్నివేశాల కోసం ఇక్కడ ఇంటి సెట్ వేశారు. ఇదేవిధంగా.. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా నడుస్తుంది. అయితే.. చిన్న షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండడంతో.. అమెరికాని తలపించే చిన్న చిన్న సెట్స్ వేశారు.
బడ్జెట్ సంగతేంటో..?
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల్లో చాలా వరకు కరోనా ముందు మొదలైనవే. లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ ఆగిపోవడంతో నిర్మాతలు చాలా నష్టపోయారు. ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అనివార్యంగా సెట్లు వేసి షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇది బడ్జెట్లో ఊహించని పరిణామం. దీనివల్ల నిర్మాణ వ్యయం ఎంత పెరుగుతుందోనని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఎలాగో దిగాం కాబట్టి అనుకుంటూ.. తమ తమ సినిమాలను సెట్ చేసుకునేందుకు సెట్లు వేస్తున్నారు. మరి, ఈ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో? ఎక్కడ విడుదలవుతాయో(థియేటర్-ఓటీటీ)? వచ్చే ఫలితం ఎలా ఉంటుందోననే టెన్షన్ మాత్రం ప్రొడ్యూసర్లలో కొనసాగుతూనే ఉంది.