ఇప్పటికే ఇండియాలో జంగిల్ బుక్ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ గురించి చాలా చర్చ జరిగింది. ఐతే మూడో వారంలో సైతం ఆ సినిమా ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదు. ఈ వారమే విడుదలైన కొత్త బాలీవుడ్ సినిమా తరహాలో అనూహ్యమైన కలెక్షన్లు సాధించింది ‘జంగిల్ బుక్’. మూడో వారాంతంలో ఆ సినిమా సాధించిన కలెక్షన్లు చూస్తే కళ్లు తిరగడం ఖాయం. మొన్న శుక్రవారం ఇండియాలో రూ.3.58 కోట్లు వసూలు చేసిన ‘జంగిల్ బుక్’.. ఆ తర్వాతి రోజుకు అనూహ్యంగా 80 శాతానికి పైగా కలెక్షన్లు పెంచుకుంది. శనివారం రూ.6.65 కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాతి రోజుకు ఇంకో 30 శాతానికి పైగా గ్రోత్ కనిపించింది. ఆదివారం జంగిల్ బుక్ వసూళ్లు రూ.8.69 కోట్లు కావడం విశేషం.
మొత్తంగా ‘జంగిల్ బుక్’ ఇప్పటిదాకా ఇండియాలో రూ.142 కోట్లు వసూలు చేయడం విశేషం. దీనికి ముందు ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్ హాలీవుడ్ మూవీగా నిలిచిన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ రూ.108 కోట్లు వసూలు చేసింది. ‘జంగిల్ బుక్’ జోరు చూస్తుంటే ఈజీగా రూ.200 కోట్ల మార్కును టచ్ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన రెండో వారం షారుఖ్ ఖాన్ మూవీ ‘ఫ్యాన్’ రిలీజైంది. దాని కోసం ‘జంగిల్ బుక్’కు థియేటర్లు కూడా తగ్గించారు. దీంతో దీని కలెక్షన్లు పడిపోతాయని అనుకున్నారు. కానీ ఉన్న థియేటర్లలోనే హౌస్ ఫుల్స్ తో నడుస్తూ అదరగొడుతోంది ‘జంగిల్ బుక్’. మూడో వారాంతంలో కూడా హాళ్లు కళకళలాడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ అలరించేలా సినిమా తెరకెక్కడంతో.. ఫ్యామిలీస్ సినిమాను బాగా ఆదరిస్తున్నాయి.