• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బండ్ల గణేష్ అరెస్ట్

బండ్ల గణేష్ అరెస్ట్

By - Tupaki Desk
Update: 2019-10-23 14:15 GMT
ఒక నిర్మాతను బెదిరించిన కేసులో బండ్ల గణేష్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 420 - 448 - 506r/w - 43 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  ఇటీవల బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి తనను బెదిరించారని వైసీపీ నేత - సినీ నిర్మాత అయిన పీవీపీ కేసు పెట్టారు. ముందు జూబ్లీహిల్స్ పోలీసులు బండ్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు.

గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత. ఆ సినిమాకు గణేష్ వరప్రసాద్ నుంచి 30 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు. ఆ సినిమా బాగానే ఆడింది. అయినా అప్పట్లో కొంత మొత్తమే తిరిగి చెల్లించారట బండ్ల. తర్వాత మిగతా డబ్బుల కోసం పీవీపీ అనేక సార్లు బండ్లను సంప్రదించినా ప్రయోజనం లేదని పీవీపీ ఆరోపించారు. చివరకు డబ్బులు ఇవ్వమని గట్టిగా ఒత్తిడి తెస్తే అనుచరులతో వచ్చి బెదిరించినట్లు బండ్ల గణేష్ పై పీవీపీ ఆరోపణలు చేశారు. అదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బండ్ల కేసు నమోదు అనంతరం కనిపించలేదు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు అందుబాటులోకి వచ్చారు. పోలీసులు బండ్లను విచారించారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం దీనిపై ఒక ఆన్ లైన్ యుద్ధం కూడా నడిచింది.
Tags:    
  • Telugu Producer 
  • Bandla Ganesh 
  • Telugu News 

Similar News

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS