తండ్రి మరణం.. విషాదంలో హీరో

Update: 2020-02-17 05:25 GMT
ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించి ప్రస్తుతం ప్రత్యేక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సినీ నటుడు శ్రీకాంత్ విషాదంలో మునిగారు. తన తండ్రి మేక పరమేశ్వరరావు (70) ఆదివారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పరమేశ్వరరావు నాలుగు నెలలుగా హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. తండ్రి మృతితో శ్రీకాంత్ కుటుంబసభ్యులు విషాదంలో మునిగారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ను సినీ రంగానికి చెందిన పలువురు పరామర్శించారు.

1948 మార్చి 16వ తేదీన కృష్ణా జిల్లా మేకా వారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవపాలెం కు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. పరమేశ్వర రావు అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు.

1990 నుంచి శ్రీకాంత్ సినీ రంగంలో రాణిస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించిన శ్రీకాంత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులతో కలిసి సినిమాలు చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ శ్రీకాంత్ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కుటుంబానికి తుపాకీ డాట్ కమ్ ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తోంది. ఆ విషాదం వెంటనే ఆ కుటుంబం కోలుకోవాలని ఆకాంక్షిస్తోంది.
Tags:    

Similar News