అబ్బాయిలది ఓకె. అమ్మాయిలది తప్పేంటి?

Update: 2017-08-22 09:09 GMT
చాలామంది పెద్దలు ఎప్పటినుండో సెన్సారింగ్ సిస్టమ్ మారాలంటూ నానా హంగామా చేస్తున్నారు. అయితే ఈ మద్యకాలంలో సెన్సార్ చేసేటప్పుడు.. కొన్నిసార్లు హీరోయిన్ల అందాలపై ఎందుకు బ్లర్రింగ్ చేయమంటున్నారో అర్ధం కావట్లేదు అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే అలా బ్లర్ చేయడం వలన అసలు ఉపయోగం ఏంటనేది వీరి ప్రశ్న.

ఈ మధ్యకాలంలో వచ్చిన డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నీటికొలనులో నుండి బికినీలో బయటకు వస్తున్న పూజ హెగ్డే అందాలను బ్లర్ చేయించారు సెన్సార్ వారు. అయితే దీనిపై సూటి మాటలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే తమ్మారెడ్డి భరద్వాజ ఏమంటున్నారంటే.. ''అసలు ఇలా బ్లర్ చేయడం వలన ఉపయోగం ఏంటి? అలా బ్లర్ చేసి ఇంకా అక్కడే చూడమని అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ప్రక్కన అబ్బాయిలు షర్టులు లేకుండా కనిపిస్తే ఓకె అంటున్నారు కదా.. మరి అమ్మాయిలు బికినీల్లో కనిపిస్తే ఏమైంది?'' అంటూ ఒక పత్రికా ఇంటర్యూలో ఈయన చెప్పేశారు.

బాగానే ఉంది కాని.. సెన్సార్ సభ్యులు ఈ విషయంపై ఏమంటున్నారంటే.. 'ఎ' సర్టిఫికేట్ తీసుకుని బికినీ సీన్ చూపించినా పర్లేదు కాని.. 'యు' సర్టిఫికేట్ కావాలి.. బికినీ సీన్ కూడా ఉండాలి అంటే ఎలా అంటున్నారు. 'యు' లో అయితే పూర్తిగా కట్ చేస్తాం.. 'యు/ఎ'లో అయితే బ్లర్ చేయిస్తాం అని చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఈ బ్లర్రింగ్ ఏదో ఇప్పుడు చిచ్చుపెడుతోందబ్బా!!
Tags:    

Similar News