ఈ సినిమా పోస్టర్ చూస్తే షాకే

Update: 2017-12-09 07:31 GMT
ఒక సినిమా పోస్టర్ మీద థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించడం మామూలే. కానీ పైరసీ వెబ్ సైట్లో తమ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చిత్ర బృందమే పోస్టర్ మీద ప్రకటించడం ఎన్నడైనా చూశామా..? ఓ తమిళ సినిమా చిత్ర బృందం ఇదే పని చేసింది. ‘తమిళ్ పడం 2.0’ చిత్ర టైటిల్ లోగో పోస్టర్ మీద థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించి.. దాని కిందే పైరసీ వెర్షన్ రిలీజ్ డేట్ కూడా వేసింది. ఈ చిత్రం 2018 మే 25న థియేటర్లలో రిలీజవుతుందట. మరుసటి రోజు ‘తమిళ్ రాకర్స్’ అనే పైరసీ వెబ్ సైట్లో సినిమా రిలీజవుతుందని పోస్టర్ మీద పేర్కొనడం విశేషం. తామెంత ప్రాక్టికల్ గా ఉన్నామో చెప్పడానికి ఇలా చేశారో.. లేక తమిళ సినిమాలపై పైరసీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి సెటైరికల్ గా చెప్పారో.. ఏదేమైనా దీని గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.


Tags:    

Similar News