• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రవితేజ.. అనుష్కల తో అరవ...

రవితేజ.. అనుష్కల తో అరవ హీరో ఢీ

By - Tupaki Desk
Update: 2019-11-15 06:50 GMT
రవితేజ నటించిన 'డిస్కోరాజా' మరియు అనుష్క నటించిన 'నిశబ్దం' చిత్రాలు సంక్రాంతి సీజన్‌ తర్వాత అంటే జనవరి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల ను కలిగి ఉన్నాయి. రెండు సినిమాలు ఒకే సారి రావడం వల్ల రెండింటికి కూడా నష్టం జరుగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు సినిమాల మద్య కనీసం రెండు మూడు రోజుల గ్యాప్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట.

జనవరి చివరి వారం కోసం ఈ రెండు సినిమాలు కొట్టుకుంటున్న సమయం లో అనూహ్యం గా తమిళ స్టార్‌ హీరో సూర్య కూడా తన తాజా చిత్రం తో అదే సమయం లో రాబోతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. సుధ కొంగర దర్శకత్వం లో తెరకెక్కిన 'సూరరై పొత్రు'ను జనవరి చివరి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. తెలుగు లో కూడా ఈ సినిమా ను భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయగా సూర్య అభిమానులు సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఎయిర్‌ డెక్కన్‌ ఫౌండర్‌.. కెప్టెన్‌ జీఆర్‌ గోపీనాథ్‌ రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారం గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఆసక్తి కర అంశాల తో పాటు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కూడా ఈ చిత్రంలో కావాల్సినంత ఉంటుందంటూ యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. కనుక సినిమా ఖచ్చితం గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం తో ఉన్నారు. సూర్య కు తెలుగు లో మంచి మార్కెట్‌ ఉంది. కనుక రవితేజ మరియు అనుష్కల తో పోటీ పడటం వల్ల అందరు నష్ట పోయే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

Tags:    
  • Tamil Nadu 
  • Ravi Teja 
  • Kollywood 
  • Kollywood Latest Updates 
  • Kollywood News 
  • Anushka 
  • Disco Raja 
  • Nishbdam 
  • Tupaki News 

Similar News

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

Copyright @2026

Powered by Blink CMS