పప్పి ప్రేమకంటే మరొకటి లేదంటున్న సీటిమార్ బ్యూటీ!!

Update: 2020-07-23 17:12 GMT
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వలన ఎల్లప్పుడూ షూటింగులు.. ఓపెనింగ్స్.. ఫోటోషూట్లు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే సెలబ్రిటీలు ఈ మధ్యే కాస్త కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ తమన్నా కూడా దొరికిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. అంతేగాక సోషల్ మీడియా ద్వారా తన ఫిట్నెస్ వీడియోస్.. తాజా ఫోటోషూట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంది. ఇవి మాత్రమే గాక అప్పుడప్పుడు లైవ్ లోకి వచ్చి అభిమానులతో సరదాగా ముచ్చటిస్తుంది. అయితే అమ్మడు గ్లామర్ తో పాటు అంతే యాక్టీవ్. తమన్నా మంచి పెట్ లవర్ కూడా. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో తన పెట్.. కుక్కపిల్లతో దిగిన ఫోటోలు షేర్ చేసింది. అలాగే 'పప్పి ప్రేమను మించింది మరొకటి లేదు' అంటూ కాప్షన్ కూడా జోడించింది. ఈ పిక్ చూస్తూ అభిమానులు, నెటిజన్లు నిజమే తమన్నాకి పెట్స్ అంటే ఎంత ప్రేమో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ప్ర‌స్తుతం తమన్నా సీటీమార్ సినిమాలో న‌టిస్తుంది. గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్ర క‌బ‌డ్డీ జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. త‌మ‌న్నా తెలంగాణ జ‌ట్టు క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌గా క‌నిపిస్తుంద‌ట‌. తెలంగాణ అమ్మాయిగా క‌న‌ప‌డ‌టానికి త‌మ‌న్నా చాలా మేకోవ‌ర్ అయ్యింద‌ట‌. తెలంగాణ యాసలో మాట్లాడి అలరించడానికి సిద్ధం అవుతుంది. అంతేగాక తాజాగా కన్నడ హిట్ ఫిల్మ్.. 'లవ్ మోక్ టైల్' తెలుగు రీమేక్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో సత్యదేవ్ హీరోగా నటించనున్నాడు. అయితే నాగశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ సెప్టెంబర్ నుండి షూటింగ్ ప్రారంభం కానుందట. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే షూటింగ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News