కోటి తీసుకున్నానన్న తమన్నా!!

Update: 2016-09-28 13:30 GMT
మిల్కీ బ్యూటి తమన్నా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఒకేరోజు తెలుగు ప్రేక్షకులను రెండు విధాలుగా అలరిస్తోంది. అక్టోబర్ 7న విడుదలయ్యే 'అభినేత్రి' సినిమాతో అమ్మడు హీరోయిన్ గా అటు ప్రభుదేవా సరసన ఇటు సోనూ సూద్ సరసన.. అలాగే ఒక ఇండివిడ్యుయల్ పాటలోనూ అదరగొట్టనుంది. పైగా ఈ సినిమాలో దెయ్యం పాత్రను కూడా చేస్తూ హడలెత్తిస్తుందంట.

అదే విధంగా అమ్మడు అదే 7న జాగ్వుర్ సినిమాలో దుమ్మురేపే ఐటెం సాంగులో సంపంగి అంటూ అలరించనుంది. అసలు ఈ ఐటెం సాంగును చేయడానికి తమన్నా ఏకంగా 1 కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావిస్తే.. ''అవును భారీ మొత్తాన్నే అందుకున్నాను. నన్ను ఆడియన్స్ ఎడిషనల్ గ్లామర్ అందిస్తున్నందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఐటెం సాంగ్స్ చేస్తున్నా. పైగా బాగా డబ్బులు కూడా ఇస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నా'' అంటూ సెలవిచ్చింది. మొత్తానికి భారీ మొత్తాన్ని పుచ్చుకున్నా అంటూ క్లారిటీ ఇచ్చేసి.. మీడియాకు సైతం షాకిచ్చేసింది అమ్మడు.

అయితే తమన్నా రానున్న రోజుల్లో మరిన్ని ఐటెం సాంగులు చేసి ఇలాగే ఇరగదీస్తుందట.
Tags:    

Similar News