బ్యాక్ ఫీట్ తో మైండ్ బ్లాక్ చేసిన మిల్కీ

Update: 2021-08-19 04:30 GMT
మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ సుదీర్ఘ జర్నీ విజ‌య‌వంతంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు వ‌రుస‌ సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంటూనే మ‌రోవైపు ఓటీటీ సిరీస్ లు.. బుల్లితెర షోల‌ను విడిచిపెట్ట‌డం లేదు. అలాగే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లతోనూ భారీగా ఆర్జిస్తోంది. త‌న‌వైపు వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌కుండా స‌ద్వినియోగం చేసుకుంటుంది. హీరోయిన్ గా న‌టిస్తూనే.. ఐట‌మ్ పాట‌ల్లోనూ మెరుస్తోంది. వీట‌న్నిటినీ మించి రామ్ చ‌ర‌ణ్ -శంక‌ర్ పాన్ ఇండియా సినిమాతో లేడీ విల‌న్ గాను ట‌ర్న్ అవుతోంది. ఓ స్టార్ హీరోయిన్ ఇన్ని ర‌కాల వేరియేష‌న్స్  ప్ర‌య‌త్నించ‌డం నిజంగా సంచ‌ల‌న‌మే. వెట‌ర‌న్ న‌టి ట‌బుని స్ఫూర్తిగా తీసుకుని త‌మ‌న్నా కెరీర్ ప‌రంగా ఎక్క‌డా గ్యాప్ లేకుండా ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతోంది. ఇటీవ‌ల తెలుగులో టీవీ షోస్ తోనూ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇప్ప‌టికే ఓ ప్ర‌ముఖ ఛానెల్ లో `మాస్ట‌ర్ చెఫ్` తెలుగు వెర్ష‌న్ కు హోస్ట్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టింది. దీన్నిబ‌ట్టి త‌మ‌న్నా మునుముందు తెలుగు బుల్లితెరపై మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేసేందుకు ఛాన్సుంద‌ని భావిస్తున్నారు. ప‌లు బుల్లితెర‌  రియాలిటీ షోల‌కు హోస్టింగ్ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.  ఇలా కెరీర్ ప‌రంగా ప‌క్కా ప్లానింగ్ తో ముందుకెళుతోంది. ఇక సెల‌బ్రిటీ లైఫ్ లో పోటీని బ్యాలెన్స్ చేయాలంటే అన్నిటికంటే ముఖ్య‌మైన‌ది ట్రెండీ ఫ్యాష‌న్ ఐక‌న్ గాను వెలిగిపోవాలి. దానికోసం ఫిజిక‌ల్ ఫిట్నెస్ ప‌రంగానూ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి. నిత్యం జిమ్ ...యోగా అంటూ ఫిట్ నెస్ కాపాడుకోవ‌డంలోనూ త‌మ‌న్నా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

సోష‌ల్ మీడియాలో హాటెస్ట్ కంటెంట్ ఎలివేష‌న్స్ తోనూ కుర్రాళ్ల అటెన్ష‌న్ ని డ్రా చేయ‌డంల‌నూ ముందుంది. తాజాగా మ‌రోసారి ఇన్ స్టాలో త‌మ‌న్నా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ మంట‌లు రేపుతోంది. ఈసారి వెన‌క వైపుగా ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేసింది. రెండు చేతుల‌ను అలా త‌న కురుల‌లోకి పోనిచ్చి పోనీటైల్ ముడి వేస్తోంది. అలా బ్యాక్ ఫేసింగ్ లో ఫోజులివ్వ‌డానికి కార‌ణం త‌న హెయిర్ క‌ల‌ర్ ని హైలైట్ చేయ‌డానికేన‌ని అర్థ‌మ‌వుతోంది. ``రైజింగ్ ఇన్ ద మ్యాజిక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్`` అంటూ క్యాప్ష‌న్ ని ఇచ్చింది. మిల్కీ గ్రే హెయిర్ లుక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్‌ ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. మిల్కీబ్యూటీ అభిమానులు హాట్ కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు.

త‌మ‌న్నా న‌టించిన ప‌లు చిత్రాలు రిలీజ్ ల‌కు రావాల్సి ఉంది. ఇందులో మాస్ట్రో త్వ‌ర‌లోనే ఓటీటీలో రానుంది. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా త‌మ‌న్నా విల‌న్ గా న‌టిస్తోంది. న‌భా న‌టేష్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. మేర్ల పాక ముర‌ళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీటీమార్ - గుర్తుందా శీతాకాలం- ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి - బోలే చుడియాన్ లాంటి చిత్రాల్లోనూ త‌మ‌న్నా న‌టించింది. వ‌రుణ్ తేజ్ గ‌ని చిత్రంలో స్పెష‌ల్ నంబ‌ర్ లో న‌ర్తిస్తోంది. వెంకీ స‌ర‌స‌న ఎఫ్ 3లో న‌టిస్తోంది. ప్లాన్ ఏ ప్లాన్ బి అనే హిందీ చిత్రంలోనూ త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించింది.
Tags:    

Similar News