తమన్నా రేంజ్‌ అంతకు పడిపోయిందా?

Update: 2015-07-29 06:07 GMT
ఇటీవలి కాలంలో స్టార్‌ హీరోయిన్లు ఐటెమ్‌ నంబర్లు చేస్తూ కాసుల్ని కురిపించుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారన్న విమర్శల్ని కూడా మూటగట్టుకుంటున్నారు. అయితే కవరింగు కోసం ఆ ఐటెమ్‌ వల్ల జనాల్లో మరింత క్రేజు పెరుగుతుందనే అలా చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఇటీవలి కాలంలో శ్రుతిహాసన్‌, తమన్నా, నయనతార, ఇలియనా ఇలా స్టార్‌ హీరోయిన్లంతా ఐటెమ్‌ నంబర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

మొన్నటిరోజున సన్నజాజి సోయగం ఇలియానా అఖిల్‌ సినిమాలో ఐటెమ్‌ నంబర్‌ చేస్తోందంటూ వార్తలొచ్చాయి. నిన్నటికి నిన్న తమన్నా కూడా ఐటెమ్‌ కి పడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న మా నాన్నకు ప్రేమతో చిత్రంలో తమన్నా ఐటెమ్‌ నంబర్‌లో నర్తించనుందని తెలుస్తోంది. వాస్తవానికి తమన్నా బాహుబలి సక్సెస్‌ ని ఎంజాయ్‌ చేసే మూడ్‌ లో ఉంది. అవంతికగా తన క్యారెక్టర్‌ పై ప్రశంసలు, విమర్శలు ఏకకాలంలో వెల్లువెత్తాయి. బాహుబలి 2లో అనుష్క పార్ట్‌ ఎక్కువ, తన పాత్రకి పరిధి స్వల్పం.

అందుకే సరిగ్గా ఈ టైమ్‌ లో రూట్‌ మార్చి ఇలా తమన్నా ఐటెమ్‌ భామగా జనాల ముందుకు రావాలనుకుందా? కాస్త రిలీఫ్‌ కోసమే ఇలా చేస్తోందా? అన్న సందేహాలు మిల్కీ అభిమానులకు వస్తున్నాయి. ఏదేమైనా మరీ ఇంతగా దిగజారాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. అల్లుడు శీను తర్వాత మళ్లీ తమ్మూ ఐటెమ్‌ నంబర్‌ ఈ సినిమాలోనే.

Tags:    

Similar News