• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షాక్ నుండి తమన్నా...

షాక్ నుండి తమన్నా తేరుకోవడం కష్టమే

By - Tupaki Desk
Update: 2017-05-03 04:31 GMT
బాహుబలి2 మూవీ.. సెన్సేషన్స్ కి సెంటర్ పాయింట్.. కలెక్షన్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. నాలుగు రోజులకే 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి.. తిరుగులేని రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పుడప్పుడే వీటిని టచ్ చేయడం ఎవరి తరం కాదనే స్థాయిలో వసూళ్లు వచ్చిపడుతున్నాయి. ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు ఎవరైనా సంతోషించాల్సిందే కానీ.. తమన్నా తెగ ఫీలయిపోతోంది. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీరుపై తెగ బాధపడిపోతోందట కూడా.

బాహుబలిలో లీడ్ కేరక్టర్స్ లో తమన్నా కూడా ఉంది. మొదటి భాగంలో కీలకమైన పాత్రలోనే కనిపిస్తుంది. రెండో భాగంలో కూడా మిల్కీ ఉంటుంది కానీ.. కొన్ని ఫ్రేమ్స్ కి మాత్రమే పరిమితం. అంతా కలిపి స్క్రీన్ టైం నిమిషంన్నర లోపే తమన్నా కేరక్టర్ కనిపిస్తుంది. నిజానికి బాహుబలి2 రిలీజ్ కి ముందు.. క్లైమాక్స్ లో తనదే కీలక పాత్ర అని చెప్పుకుంది మిల్కీ బ్యూటీ. కానీ థియేటర్లలో మూవీ చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. కేమియో రోల్ కంటే తక్కువగా తమ్ము రోల్ ఉంటుంది.బాహుబలి2 కోసం కత్తి యుద్ధాలు.. గుర్రపు స్వారీలు నేర్చుకుని మరీ యాక్టింగ్ చేసేసింది తమన్నా. కానీ ఫైనల్ కట్ లో తమన్నా రోల్ మొత్తం ఎగిరిపోయింది.

సరిగ్గా ఈ పాయింటే మిల్కీ బ్యూటీని అప్ సెట్ చేసిందట. ఇదే విషయంపై రాజమౌళితో చిన్నపాటి వాగ్వివాదం కూడా జరిగిందని అంటున్నారు. అయితే ఇవన్నీ కాదంటూ తమన్నా ఖండించింది కాని.. తమిళనాట ఒక మీడియా హౌస్ తమన్నాకు ఫోన్ చేసి.. అప్పట్లో నువ్వు క్లయ్ మ్యాక్స్ లో చింపేస్తున్నా అన్నావ్ గా అంటూ పంచ్ వేయగా.. అవును రాజమౌళి హర్ట్ చేశాడు అంటూ నిజం చెప్పేసిందట. తరువాత కాల్ చేసి.. ఆ బైట్ ఇప్పుడు వేయకండి ప్లీజ్ అని కూడా చెప్పిందట. ఇప్పుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్. ఎంతైనా ఈ షాక్ నుండి తేరుకోవడం కష్టమే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tamanna 
  • Rajamouli 2 
  • Baahubali 2 Movie 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS