మిల్కీ కమిట్‌మెంట్‌ కి అంతా దాసోహం

Update: 2015-08-03 04:32 GMT
మిల్కీవైట్‌ బ్యూటీ తమన్నా కెరీర్‌ ని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర సంగతులు ఇట్టే అర్థమవుతాయి. ఈ అమ్మడి కెరీర్‌ లో సక్సెస్‌ రేటు చాలా తక్కువ. హ్యాపీడేస్‌, 100పర్సంట్‌ లవ్‌, రచ్చ, బాహుబలి వంటి సినిమాలు .. తప్ప వేరే ఏ సినిమా సక్సెస్‌ ని ఇవ్వలేకపోయాయి. ఊసరవెల్లి, ఎందుకంటే ప్రేమంట, బద్రీనాథ్ వంటి సినిమాలు అసాధారణమైన ఫ్లాప్‌ లుగా నిలిచాయి. అయినా తమన్నా కెరీర్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా కిందికి పడిపోకుండా నిలబడడానికి కారణం ఉంది. ఈ భామ హిట్‌ సినిమాలో ఎంత గొప్పగా నటించిందో ఫ్లాప్‌ సినిమాలోనూ అంతే గొప్పగా నటించింది.

 100పర్సంట్‌ లవ్‌ చిత్రంలో కాలేజ్‌ అమ్మాయిగా, క్లాస్‌ టాపర్‌ గా, బావకు తగ్గ మరదలి పిల్లగా అద్భుతంగా అభినయించింది. సేమ్‌ టైమ్‌ ఊసరవెల్లి చిత్రంలో ఓ సన్నివేశంలో కంట తడి పెట్టించే నటప్రదర్శన ఇచ్చింది. ఓ సన్నివేశంలో ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని బతిమాలుకునే తీరు గుండె తడి పెంచుతుంది. అలాగే ఎందుకంటే ప్రేమంటే చిత్రంలో ఆత్మగా కనిపించే ప్రతి సన్నివేశంలో మిల్కీ మెరుపులు కనిపిస్తాయి. ఇటీవలి బాహుబలి చిత్రంలో పచ్చబొట్టేసి అంటూ సొగసుకత్తెగా కనిపిస్తూనే, కత్తి పట్టిన వీరనారిగా మెప్పించింది. అందుకే దర్శకులంతా ఆ కమిట్‌ మెంట్‌ కే పడిపోతారంటే అతిశయోక్తి కాదు.
Tags:    

Similar News