పాకిస్తాన్ క్రికెటర్ తో ఎఫైర్ పై స్పందించిన తమన్నా!

Update: 2020-05-04 12:30 GMT
ఇది సోషల్ మీడియా యుగం.. బయట సెలెబ్రెటీలు ఇద్దరు కనిపిస్తే చాలు ఎఫైర్లు అంటగడుతారు. వారి ఫొటోలు వైరల్ చేసి వీరు డేటింగ్ లో ఉన్నారు. అంతా అయిపోయింది.. త్వరలో పెళ్లి అని ప్రచారం కల్పిస్తారు. ఈ సోషల్ మీడియా యుగంలో సెలెబ్రెటీల జీవితాలు.. పర్సనల్ లైఫ్ ను ఎంత కాపాడుకుంటే అంత బెటర్. సెలెబ్రెటీల ప్రతి ఫొటో లేదా ప్రతి సందేశాన్ని అభిమానులు దీర్ఘంగా చూస్తూ తప్పులు లెంకుతారు.

పాకిస్తాన్ క్రికెటర్‌తో మన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నాకు ఎఫైర్ ఉందని అప్పట్లో చాలా గాసిప్పులు వచ్చాయి. తమన్నాతో ఆ క్రికెటర్ షాపింగ్ చేస్తున్న పాత ఫొటో తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు పెళ్లి అంటూ.. ప్రేమ అంటూ ఏదేదో రాసుకొచ్చారు. వారిద్దరికి పెళ్లి కుదిరిందని.. బంగారం కొనివ్వడానికే షాపింగ్ చేసినట్టు ప్రచారం చేశారు.

నిజానికి ఆ ఫొటో పాతది. ఈ 30 ఏళ్ల తమన్నా.. పాకిస్తానీ సీనియర్ రిటైర్డ్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి దుబాయ్‌లో ఓ బంగారం షాపు ప్రారంభోత్సవంలో కనిపించింది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ ప్రముఖ అతిథులుగా వచ్చారు.

కానీ ఈ ఫొటోను బేస్ చేసుకొని తమన్నా ఇప్పటికే వివాహం చేసుకున్న పాకిస్తాన్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.. తమన్నా మాత్రం ఇలాంటి వెర్రి పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఎవరితోనూ సంబంధం లేదని స్పష్టం చేసింది.

రెండేళ్లలో తాను జీవితంలో స్థిరపడతానని తమన్నా ఇటీవల ప్రకటించింది. రెండేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదంది.. ఆమె ప్రస్తుతం సంపత్ నంది చిత్రం “సీటిమార్” లో గోపిచంద్ సరసన నటిస్తోంది.
Tags:    

Similar News