చేనేత దుస్తుల్లో ట‌బు త‌ళుకులు!

Update: 2022-08-08 10:49 GMT
తెలంగాణ రాష్ట్రంలోని చేనేత పరిశ్రమ -చేనేత కార్మికుల ప్రత్యేక కళ - కళాఖండాలు దేశంలోనే  ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. చేనేత‌ ప‌రిశ్ర‌మ‌ల్ని ప్రోత్స‌హించాల‌ని ప్ర‌భుత్వ చొర‌వ ప్ర‌శంసనీయం.  టాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం చేనేత క‌ళ‌ని ప్రోత్స‌హించాల‌ని ప‌లు అవేర్ నెస్ కార్య‌క్ర‌మాలు  చేసారు.  ప్ర‌భుత్వం చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా కొంత మంది సెల‌బ్రిటిల్ని సైతం నియ‌మించింది.

తాజాగా  జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నటి టబు తెలంగాణ చేనేత వ‌స్ర్తాల్లో త‌ళుక్కున మెరిసారు.  తెలంగాణ నేత‌ వస్త్రాలతో తయారు చేసిన 50కి పైగా చీరలు డిజైన‌ర్ వస్త్రాలతో కూడిన ఫ్యాషన్ షో నిర్వ‌హించారు.  

ట‌బు  సాంప్రదాయ  పొట్టి కుర్తా మరియు దుపట్టా ధ‌రించి ఆక‌ట్టుకున్నారు. మెడ‌లో నెక్లెస్..చెవిపొగులు..చేతుల‌కు మెరుస్తున్న గాజులు ధ‌రించి త‌ళుక్కున మెరిసారు. తెలుగు సంప్ర‌దాయంలో అభివాదం చేస్తూ క‌నిపిస్తున్న ట‌బు ఫోటో నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతోంది.
 
చేనేత విస్తృతి - వైవిధ్యాన్ని చాటిచెప్పేందుకు అవార్డ్ విన్నింగ్ టెక్స్‌టైల్స్ డిజైనర్ గౌరంగ్ షా అందించిన 'అమోఘం' ఈవెంట్‌లో 21 మంది మహిళలు - ఐదుగురు పురుషులతో సహా మొత్తం 26 మంది మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు.  తెలంగాణ చేనేత  మ‌రియు జౌళి శాఖ మరియు చేనేత నేత సహకార సంఘం (టెస్కో) ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

పోచంపల్లి .. పుట్టపాక నుండి శక్తివంతమైన ఇక్కత్‌లు.. సొగసైన గద్వాలు మరియు ఇతర స్థానిక వస్త్రాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఘ‌నంగా జ‌రిగింది.  లెహంగా రూపంలో బట్టలపై చేసిన చెరియాల్ పెయింటింగ్‌లు  సంపూర్ణ క్లాసిక్ గా నిలిచింది.చేతితో తయారు చేసిన ఏటి కొప్పాక బొమ్మలను ఉపయోగించే టాసెల్స్ రాష్ట్ర ప్రత్యేకతని చాటాయి.

చేతితో నేసిన షిఫాన్.. ఖాదీ .. కోటా యొక్క గొప్పతనాన్ని  అద్భుతంగా ప్రదర్శించారు.  ప్రదర్శనలో ఉన్న ప్రతి వస్త్రం తెలంగాణ మగ్గాలపై తాయ‌రు చేయ‌బ‌డిందే.  గౌరంగ్ మాట్లాడుతూ 'మేము త‌యారు  చేసి ప్రదర్శించిన ప్రతి కళ తెలంగాణకు చెందిన కాలాతీతమైన పని మాత్రమే కాదు. కాలాతీత సృజనాత్మకత కూడా. చేనేత‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది' అని తెలిపారు.
Tags:    

Similar News