• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో పాన్ ఇండియా...

మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...?

By - Tupaki Desk
Update: 2020-08-05 11:10 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ 'పాన్ ఇండియా స్టార్'గా మారిపోయారు. ఈ క్రమంలో తదుపరి సినిమా 'సాహో'తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ నిలబెట్టుకున్నాడు ప్రభాస్. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు సైతం డార్లింగ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 'బాహుబలి' సినిమా కోసం ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి వర్క్ చేసిన ప్రభాస్.. 'సాహో' సినిమాతో టీ - సిరీస్ భూషణ్ కుమార్ తో కలిసాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ''రాధే శ్యామ్'' సినిమాకి కూడా టీ - సిరీస్ భూషణ్ కుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీ - సిరీస్ వారు యంగ్ రెబల్ స్టార్ తో మూడో చిత్రంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారని బాలీవుడ్ మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా ప్రభాస్ తో టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మైథోలాజికల్ డ్రామా స్టోరీ లైన్ ఇప్పటికే ప్రభాస్ కి చెప్పారని తెలుస్తోంది. అంతేకాకుండా స్టోరీ లైన్ కి ఇంప్రెస్ ఐన డార్లింగ్ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడని బాలీవుడ్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. ప్రభాస్ కి దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని కూడా పలు భారతీయ భాషల్లో రూపొందిస్తారట. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ''రాధే శ్యామ్'' మరియు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత టీ-సిరీస్ నిర్మాణంలో ఈ భారీ పౌరాణిక చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ''రాధే శ్యామ్'' సినిమా ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పరిస్థితులు అనకూలిస్తే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణే హీరోయిన్ గా నటించనుంది. దేశ విదేశాల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ కాస్తా ఈ సినిమాతో 'గ్లోబల్ స్టార్' గా మారిపోతాడని చెప్పవచ్చు.
Tags:    
  • Prabhas 
  • T series 
  • Bhushan Kumar 
  • Pan India Movie 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS