• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ప‌రిస్థితుల్లోనూ `సై...

ఆ ప‌రిస్థితుల్లోనూ `సై అన్న `సైరా`టీమ్!

By - Tupaki Desk
Update: 2018-07-27 11:38 GMT
మెగా స్టార్ చిరంజీవి, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ల కాంబోలో తెర‌కెక్కుతున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `సైరా న‌ర‌సింహా రెడ్డి`పై టాలీవుడ్ లో భారీ అంచ‌నాలున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు తమిళ నటుడు విజయ్ సేతుపతి - కిచ్చ‌ సుదీప్. జగపతి బాబు - న‌య‌న‌తార‌ - తమన్నావంటి స్టార్ నటీన‌టులు నటిస్తున్నారు. బాహుబ‌లి రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఖ‌ర్చుకు ఏ మాత్రం వెనుకాడ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా, ఈ చిత్రంలో అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశం  షెడ్యూల్ ముగిసింది.

ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ....కేవ‌లం 35 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ ముగించార‌ట‌. ఆ యాక్ష‌న్ పార్ట్ గురించి చిత్ర కెమెరామెన్ రత్నవేలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ చూసిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిని చిరు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తార‌ని తెలుస్తోంది.

బ్రిటిష్ ఆయుధాగారంపై ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి....త‌న అనుచ‌ర‌లతో స‌హా దండెత్తే కీల‌క‌మైన స‌న్నివేశం కోసం హైద‌రాబాద్ శివారులో ఓ భారీ సెట్ ను నిర్మించార‌ట‌. బ్రిటిష్ ఆర్మీ - ఫిరంగుల - గుర్రాల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించామ‌ని ర‌త్న‌వేలు తెలిపారు. అయితే, వర్షంతో పాటు వెలుతురులేమి ఆ షూటింగ్ కు ఆటంకం క‌లిగించాయ‌ని....అయిన‌ప్ప‌టికీ విజయవంతంగా షూటింగ్ ముగించామ‌ని అన్నారు.

కీల‌కమైన ఈ యుద్ధ సన్నివేశాల్ని 35 రాత్రుల్లో తెరకెక్కించామన్నారు. ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ చూసిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డిని చిరు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తార‌ట‌. దాంతోపాటు, ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ను వెల్ల‌డించేందుకు చిరు స్నేహితుడు తిరుప‌తి ప్ర‌సాద్ రంగంలోకి దిగార‌ని తెలుస్తోంది. తిరుప‌తి ప్రసాద్ ను నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ఏర్పాటు చేశార‌ట‌. 


Tags:    
  • Chiranjeevi 
  • Sye Raa Movie 
  • Telugu News 

Similar News

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

రాజ‌మౌళి ముందే తొడ‌లు గొడుతున్నారా?

2026-11-09 10:30 GMT

రాజమౌళి 'వారణాసి'.. ఆ తొమ్మిది రత్నాల కథేంటి!

2026-11-09 10:28 GMT

రాముడి పాత్రలో సల్మాన్ ఖాన్.. చివరికి అలాంటి అవమానం!

2026-11-09 10:26 GMT

రామాయణం.. ఐదో రోజు ఈ స్పీడ్ ఏంటి!

2026-11-09 10:24 GMT

Copyright @2026

Powered by Blink CMS