మ‌హేష్ .. సితార దుమ్ము దులిపేశారుగా

Update: 2022-03-20 11:07 GMT
సూప‌ర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం కావ‌డంతో మే 12న‌ స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కాబోతోంది. `పోకిరి` వైబ్స్ క‌నిపిస్తున్న ఈ మూవీ నిజంగా మ‌హేష్ అభిమానుల‌కు స‌మ్మ‌ర్ ట్రీట్ ని అందించ‌బోతోంద‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేస్తూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఈ మూవీకి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల సంగీత ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సాంగ్ గా `క‌ళావ‌తి` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ కి సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. తాజాగా ఆదివారం ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ని కూడా రిలీజ్ చేశారు.

`పెన్నీ..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ వీడియో విశేషం ఏంటంటే ఇందులో తొలిసారి మ‌హేష్ ముద్దుల కూతురు సితార క‌నిపించింది. ఇన్ స్టా రీల్స్ లో మ‌హేష్ పాట‌ల‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ సంద‌డి చేసిన సితార తొలిసారి ఈ పాట‌లో మ‌హేష్ తో క‌లిసి క‌నిపించింది. ఈ పాట ప్రారంభంలో అదిరిపోయే స్టెప్పులేసి స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. త‌మ‌న్  క్లాస్ బీట్ తో పాటు మాస్ స్టెప్పులేసే విధంగా ట్యూన్ ని కంపోజ్ చేసిన తీరు మ‌హేష్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది.

మ‌హేష్ వీడియోలో సితార బేబీ క‌లిసి స్టెప్స్ తో అద‌ర‌గొట్టిన తీరుకి ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నార‌ట‌. శ‌నివారం ముందుగానే ఈ పాట‌కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేసింది చిత్ర బృందం. దీనికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఫుల్ లిరిక‌ల్ వీడియోని ఆదివారం సాయంత్రం విడుద‌ల చేశారు. ఈ లిరిక‌ల్ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఒకే పాట‌లో మ‌హేష్ - సితార స్టెప్పులేయ‌డంతో ఫ్యాన్స్ పూన‌కాల‌తో హంగామా చేస్తూ సెల‌బ్రేష‌న్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు.

ఇదిలా వుంటే ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జరుగుతోంది. ఓ ప‌క్క షూటింగ్ చేస్తూనే మ‌రో ప‌క్క పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని ఫుల్ స్పీడుతో పూర్తి చేస్తున్నారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీలో స‌ముద్ర‌ఖ‌ని విల‌న్ గా న‌టిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ గా మ‌ది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంక‌టేష్‌, ఆర్ట్ ఏ.ఎస్ ప్ర‌కాష్‌, ఫైట్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌, వీఎఫ్ ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్ యుగంధ‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

Full View
Tags:    

Similar News