అక్కడ హిట్ అయిన ‘హిట్‌’

Update: 2020-04-08 04:30 GMT
విశ్వక్‌ సేన్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కి గత ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్‌ చిత్రంకు కలెక్షన్స్‌ యావరేజ్‌ గా వచ్చాయి. ఒక వర్గం వారిని మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకోవడంతో కమర్షియల్‌ గా మాత్రం సక్సెస్‌ దక్కించుకోలేక పోయింది. పాజిటివ్‌ రివ్యూలు వచ్చినా కూడా హిట్‌ సినిమాకు కాసుల వర్షం మాత్రం కురియలేదు. తాజాగా ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ చేయడం ప్రారంభించారు. సినిమాకు అమెజాన్‌ ప్రైమ్‌ లో అనూహ్యమైన స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది.

స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమా వ్యూస్‌ ను దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ ను ఉపయోగించే ప్రేక్షకులు హిట్‌ సినిమాకు కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుంది. థియేటర్లలో ఎవరైతే సినిమాను చూశారో ఇప్పుడు అదే వర్గం వారు ఎక్కువగా ఓటీటీ వినియోగదారులుగా ఉన్నారు. కనుక హిట్‌ సినిమాకు అమెజాన్‌ లో మంచి విజయం దక్కిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను ప్రశాంతితో కలిసి నాని నిర్మించిన విషయం తెల్సిందే. ఒక కేసు ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యం లో సాగే ఈ చిత్రం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలను అమితంగా ఇష్టపడే వారిని కట్టిపడేస్తుంది. అందుకే అమెజాన్‌ లో ఈ సినిమాకు మంచి రిపోర్ట్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. హిట్‌ ప్రాంచైజీలో వరుసగా సినిమాలు తీస్తామంటూ ఇప్పటికే దర్శకుడు శైలేష్‌ కొలను ఇంకా హీరో కూడా ప్రకటించిన విషయం తెల్సిందే. హిట్‌ ను ఎంజాయ్‌ చేసిన ప్రేక్షకులు ప్రస్తుతం హిట్‌ 2 కోసం ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News