సుశాంత్ మరణానికి 5 రోజుల ముందు.. స్నేహితుడి సంచలన విషయాలు

Update: 2020-12-02 05:51 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి ముందు జరిగిన విషయాలను ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ గుప్తా తాజాగా బయటపెట్టాడు. ఇది సంచలనంగా మారింది. సుశాంత్ కు ఆప్త మిత్రుడైన ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి.

సుశాంత్ ఆలోచనలు.. ఆచరణలు, ఆయనతో ఉన్న అనుబంధం గురించిన పలు విషయాలను వెల్లడించారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. సుశాంత్ లో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని.. సక్సెస్, ఫెయిల్యూర్ ను సమానంగా తీసుకుంటాడని తెలిపారు. ఆయనలో మానసిక పరిణతి చాలా ఉందని వివరించారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తుంటాడు అని సిద్ధార్థ గుప్తా పేర్కొన్నాడు.

సుశాంత్ ఆలోచనలు గొప్పగా ఉంటాయని సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ తెలిపాడు. ఆయనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. తనకు ప్రేమను పంచిన ప్రజలకు ఏదో చేయాలని తపించేవాడని సిద్ధార్థ గుప్తా పేర్కొన్నారు. సుశాంత్ తన మరణానికి ఐదు రోజుల ముందు నాకు, మరో స్నేహితుడికి ఓ సందేశం పంపాడు. తాను ఆధ్యాత్మిక చింతనకు గురయ్యాను. ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నట్టు తనకు, మరో స్నేహితుడు కౌశల్‌కు మెసేజ్ పంపాడు అని సిద్ధార్థ్ గుప్తా తెలిపారు.
 
సుశాంత్ సింగ్ సందేశం పంపిన తర్వాత తాను, కౌశల్ ఆ విషయంపై చర్చించాం. సుశాంత్ జీవితంలో ఏదో జరుగుతున్నదనే భావన కలిగింది. అయితే త్వరలోనే ఆయనను కలుస్తామని చెప్పాం. అయితే తన వద్ద సుశాంత్ నెంబర్ లేకపోవడం వల్ల ఆయనను కలుసుకోలేకపోయాం అని సిద్ధార్థ్ వెల్లడించారు. అంతలోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందని అన్నారు.
Tags:    

Similar News