జూన్ 13న రియాను సుశాంత్ డ్రాప్ చేశాడు : ప్రత్యక్ష సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సీబీఐ..!

Update: 2020-10-06 12:30 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు ఇన్ని రోజులైనా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసి విచారిస్తోంది. అయితే ఇటీవల ఎయిమ్స్ వైద్య బృందం అందించిన రిపోర్ట్ ప్రకారం సుశాంత్ ది ఆత్మహత్యే అని తేలింది. సుశాంత్ బాడీలో ఎలాంటి విషం లేదని.. అది ఆత్మహత్యే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణించాడనికి ముందు రోజు జూన్ 13న సాయంత్రం సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ రియా చక్రవర్తిని తన ఇంటి వద్ద డ్రాప్ చేసాడని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారని తెలుస్తోంది. అయితే సీబీఐ విచారణలో రియా చక్రవర్తి.. జూన్ 8న సుశాంత్ సిస్టర్ ఇంటికి వస్తుండటంతో తనని వెళ్లిపోమన్నాడని.. సుశాంత్ ఆదేశాల మేరకు ఆయన ఫ్లాట్ నుంచి వెళ్లిపోయాను.. ఆ తర్వాత సుశాంత్ ని కలవలేదు అని చెప్పింది.

అయితే తాజా సమాచారం ప్రకారం జూన్ 13న రియాను సుశాంత్ డ్రాప్ చేయడం చూసిన ప్రత్యక్ష సాక్షి సీబీఐ ఎదుట హాజరై తాను చూసిన విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తి ఉండే జుహూ ప్రింరోస్ అపార్ట్‌మెంట్‌ లో నివసించే ఒకామె రిపబ్లిక్ టీవీతో మాట్లాడుతూ... జూన్ 13 సాయంత్రం సుశాంత్ - రియా కలిసి ఉండటం చూసిన సాక్షి ఉన్నారని.. సాయంత్రం 6 లేదా 6:30 గంటలకు రియాను సుశాంత్ కార్ లో డ్రాప్ చేసాడని.. ఆ తర్వాత సుశాంత్ ఒంటరిగా డ్రైవింగ్ చేసుకంటూ వెళ్లాడని ఆ సాక్షి వెల్లడించారని పేర్కొంది. అదే విషయాన్ని ప్రత్యక్ష సాక్షి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఎదుట చెప్పిందని.. సీబీఐ అన్ని వివరాలు రికార్డ్ చేసుకుందని.. అయితే ప్రత్యక్ష సాక్షి పేరు మాత్రం చెప్పలేనని రియా అపార్ట్మెంట్ లో ఉండే ఆమె వెల్లడించింది. సుశాంత్ చనిపోయే ముందురోజు అతని ఇంట్లో పార్టీ జరిగిందనే విషయంపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది నిజమేనని అనుమానం కలిగించేలా కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది.
Tags:    

Similar News