హత్య కాదా? ఎయిమ్స్ బృందంపై సుశాంత్ ఫ్యామిలీ భగభగ
సుశాంత్ సింగ్ హత్యకు గురయ్యాడని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఇది ఆత్మ హత్యనే అని ప్రఖ్యాత ఎయిమ్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ వాదనను సుశాంత్ సింగ్ ఫ్యామిలీ కొట్టిపారేసింది. దీని వెనక కుట్ర కోణం దాగి ఉందని సుశాంత్ సింగ్ కుటుంబీకులు ఆరోపించారు. `హాస్యాస్పదమైన సిద్ధాంతం ఇది` అంటూ సుశాంత్ కుటుంబం బలమైన ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం ఒక వ్యాయామ వీడియోని షేర్ చేసి సుశాంత్ హార్డ్ వర్క్ ని హైలైట్ చేసింది.
ఈ మరణంలో హత్య కోణం ‘తొలగింపు’ ను అభిమానులు.. స్నేహితులు కూడా సహించడం లేదు. ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బృందానికి చెందిన డాక్టర్ సుధీర్ గుప్తా అనధికారికంగా లీక్ ఇచ్చిన తరువాత .. ఆత్మహత్య కేసు అని పేర్కొనడం సంచలనమే అయ్యింది. దీంతో సుశాంత్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది.
#SushantSinghRajput కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో తాజాగా సుశాంత్ వీడియోని షేర్ చేయడమే గాక.. హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి కూడా ఈ కేసును పరిశీలిస్తున్న సిబిఐపై అన్ని కళ్ళు పడడంతో ‘నిజం’ తెలుస్తుందని ఆశలు పెట్టుకున్నానని.. ప్రతి ఒక్కరూ ఈ పరీక్షా కాలంలో ప్రార్థన చేయాలని కోరారు.
ఇక ఈ ఎయిమ్స్ లీకుల అనంతరం ఈ కేసులో నిజం ఏమిటో బ్లాస్ట్ చేస్తానని రిపబ్లిక్ చానెల్ అర్నాబ్ గోస్వామి వాగ్దానం చేయడం సంచలనమైంది. సుశాంత్ ఆత్మహత్య సిద్ధాంతాలకు విశ్రాంతినిచ్చే ప్రత్యేక ఆధారాలతో ప్రతిదీ బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని .. ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్‌లపై బాంబ్ పేల్చే ఆధారాలను చూపిస్తామని ప్రకటించడం కలకలం రేపింది.