• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లిక్కర్ తో స్పెర్మ్ కౌంట్...

లిక్కర్ తో స్పెర్మ్ కౌంట్ హుష్ కాకీ..!!

By - Tupaki Desk
Update: 2019-11-01 01:30 GMT
మద్యపానం అనేది ఈ జెనరేషన్ లో చాలా కామన్ అయిపోయింది.  అలాంటిదేమీ లేదు.. మా కొంపలో ఒక్కరు కూడా తాగరు అందరూ అద్భుతాలే.. పాలు తాగే బ్యాచే అని ఎవరైనా తమ పిచ్చి మనసుకు సర్దిచెప్పుకుంటే అంత కన్నా ఆత్మవంచన మరొకటి ఉండదు.  ఎందుకంటే ఇలాంటి ఇళ్ళలోనే తాగుబోతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం.  అయితే ఒకరికి తెలియకుండా ఒకరు పెగ్గులేస్తుంటారని అర్థం.

మద్యపానం హానికరం అని అన్ని మద్యం సీసా పైనే రాసి ఉంటుంది.  ఇక కొందరు సరదా దర్శకులు 'మద్యపానం హానికరం తాగితే పోతారు' అంటూ ముకేష్ తీరులో హర్రర్ సీన్ లా కాకుండా సులువైన శైలిలో సినిమా మొదట్లోనే నవ్విస్తారు.  హానికరం అని అందరికీ తెలుసు.  అయినా తాగుతారు అదే కదా కిక్కు.. అందులోనే కదా ఉండేది థ్రిల్లు.  అయితే ఎక్కడ కిక్కు ఉంటుందో అక్కడ కక్కుకునే ఛాన్స్ ఉంటుంది.  ఎక్కడ థ్రిల్ ఉంటుందో అక్కడ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది.  ఆ రిస్కులు చాలానే ఉన్నాయి.  మద్యపానం వలన కలిగే సమస్యల్లో ఇన్ ఫెర్టిలిటి కూడా ఒకటి.

మత్తులో 'మూడ్' ఎక్కువ వస్తుందని చాలామంది అపోహలో ఉంటారు కానీ నిజానికి మద్యపానం వల్ల అడ.. మగ ఇద్దరిలో సెక్స్ కోరికలు తగ్గుతాయట. ఇక ఎక్కువకాలం మద్యపానం అలవాటు ఉంటే సెక్స్ పట్ల నిరాసక్తత పెరిగే ఛాన్స్ ఉంటుందట.  మగవారిలో.. ఆడవారిలో ఇన్ ఫెర్టిలిటీ ఈమధ్య ఎక్కువవుతోంది. మద్యపానం కూడా అందుకు ఒక కారణమట. అతిగా మద్యం సేవించడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని సర్వేలు చెబుతున్నాయి. 

ఆల్కహాల్ వల్ల మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతోందని.. అది వీర్యకణాల క్వాలిటీపై ప్రభావం చూపిస్తోందట. వీర్యకణాల సంఖ్య.. సైజ్.. షేప్.. చలనం వంటి విషయాలు ప్రభావితం అవుతున్నాయట.  దీంతో వివాహితులైన మగవారికి పిల్లలు కనే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట.  మన భారతీయ సమాజంలో ఇలాంటి అలవాట్ల గురించి డాక్టర్లతో ఓపెన్ గా చర్చించేవారు చాలా తక్కువమంది ఉంటారు.  దీంతో ఈ సమస్య రాను రాను తీవ్రమవుతోందట.  మరి మద్యపానం వల్ల కలిగే ఇలాంటి దుష్ఫలితాలు పోవాలంటే దానికి మార్గం ఏంటి అంటే.. మందు మానేయడమేనట. మరీ మానేయలేం అనుకుంటే అతి తక్కువ మోతాదులో స్వీకరించడం.. పార్టీలకు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం మంచిదట.  మరీ బూస్టు ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ తరహాలో రోజూ రెచ్చిపోకూడదట.
Tags:    
  • Survey 
  • Health Problems 
  • Liquor Consumption 

Similar News

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS