ఓటీటీ ప్యాకేజీతో స్టార్ హీరో అప్పులు మొత్తం తీరినట్లేనా...?
దక్షిణాది అగ్ర కథానాయకుడు సూర్య వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ అటు తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానించే స్థాయికి చేరుకున్నారు. అందుకే సూర్య సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంటుంది. అయితే ఈ మధ్య సూర్య నటించిన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ 'సూరారై పొట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదల కానుంది. సూర్య హోమ్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా థియేటర్స్ మూతబడి ఉండటంతో 'ఆకాశం నీ హద్దురా' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి డీల్ కుదుర్చుకున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 30న విడుదల కానుంది.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై రిలీజ్ చేయాల్సిన చిత్రమని అంటున్నారు. ఈ మూవీలో ఉండే థ్రిల్స్.. విజువల్స్ బిగ్ స్క్రీన్ కి సరిపోతాయని.. కొన్నాళ్లు ఆగి థియేటర్స్ లో విడుదల చేస్తే బాగా వసూల్ చేసే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ వారు సూర్య 'ఆకాశం నీ హద్దురా' మరియు ఆయన సతీమణి జ్యోతిక 'పొన్మగల్ వంధల్' చిత్రాలతో పాటు మరో రెండు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నాడట. సూర్య ఈ నాలుగు సినిమాల కోసం ప్యాకేజీ రూపంలో దాదాపు 280 కోట్లకి డీల్ సెట్ చేసుకున్నాడని.. ఈ దెబ్బతో సూర్యకు ఉన్న 150 కోట్ల అప్పు తీరిపోయిందని కోలీవుడ్ వర్గాల్లో అనుకుంటున్నారు. ఏదేమైనా సౌత్ లోనే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మొట్ట మొదటి స్టార్ హీరో మూవీ 'ఆకాశం నీ హద్దురా' అని చెప్పవచ్చు.