• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్: సునీల్...

టీజర్ టాక్: సునీల్ ఎంతదూరమైనా వెళ్తాడట

By - Tupaki Desk
Update: 2015-09-06 09:25 GMT

Full View
ఎదుటి వాళ్ల ముఖంలో సంతోషం చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తానంటున్నాడు సునీల్. కొత్తగా ఈ స్టేట్ మెంట్ ఏంటనుకుంటున్నారా.. కృష్ణాష్టమి ట్రైలర్ లో మన కమెడియన్ టర్న్ డ్ హీరో చెప్పిన డైలాగండీ ఇది. నిన్న కృష్ణుడి ఫోజులో లుక్ రిలీజ్ చేసిన సునీల్.. ఈ రోజు టీజర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 42 సెకన్ల టీజర్ కలర్ ఫుల్ గా ఉంది. సునీల్ సినిమాల్లో ఇప్పటిదాకా ఎన్నడూ లేని భారీతనం ఈ సినిమాలో కనిపిస్తోంది. రిచ్ ఫారిన్ లొకేషన్ లు.. ఏరియల్ షాట్లు.. కలర్ ఫుల్ సెట్టింగులు.. అబ్బో వ్యవహారమంతా చాలా భారీగానే ఉంది. సునీల్ రేంజికి మించి ఖర్చు పెట్టినట్లున్నాడు దిల్ రాజు. బహుశా దర్శకుడు వాసు వర్మ కథలో ఉన్న దమ్ము చూసి కావచ్చేమో.

ఇప్పటికే పోస్టర్ లలో సరికొత్త లుక్ తో కనిపించిన సునీల్.. టీజర్ లో సైతం భిన్నంగా కనిపించాడు. పూర్తి స్థాయి స్టైలిష్ మాస్ హీరో లెవెల్ లో కనిపించాడు. యాక్షన్ కి, ఎంటర్ టైన్ మెంట్ కి ఢోకా ఉండదన్న భరోసా కలిపించేలా ఉంది టీజర్. హీరోయిన్లు నిక్కీ గర్లానీ, డింపుల్ చోప్డా లిద్దరూ అందంగా దర్శనమిచ్చారు. వాళ్లతో సునీల్ రొమాన్స్ కూడా బాగానే చేసినట్లుగా కనిపిస్తోంది. చివర్లో తన మాస్ అభిమానుల్ని మెప్పించేలా యాక్షన్ రుచి చూపించాడు సునీల్. మొత్తంగా టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేలాగే ఉంది. మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిని.. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సునీల్ ‘కృష్ణాష్టమి’తో ఏమేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో చూడాలి.
Tags:    
  • Sunil 
  • Krishnashtami Movie 
  • Telugu NEws 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS