సునీల్ లో వేదాంతం బ‌య‌ట‌కు తీస్తావా హ‌రీషా?

Update: 2020-08-31 07:50 GMT
సునీల్ `వేదాంతం రాఘ‌వ‌య్య‌`గా క‌నిపించ‌బోతున్నారు. హరీష్ శంకర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ లో రామ్ ఆచంట‌.. గోపి అచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి క‌థ‌ను హ‌రీష్ శంక‌ర్ అందించారు. గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ త‌ర్వాత హ‌రీష్ కి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇది.

టైటిల్ చాలా ఆహ్లాదకరంగా మ‌న‌సుపై మంచి ముద్ర వేస్తోంది. ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నామ‌ని 14 రీల్స్ అధినేత‌లు వెల్ల‌డించారు. అదంతా స‌రే కానీ `వేదాంతం రాఘ‌వ‌య్య‌` అంటే తెలియ‌ని పేరేమీ కాదు. ఆయ‌న సినీప్ర‌ముఖుడు. ద‌ర్శ‌క‌న‌టుడు.. నృత్య ద‌ర్శ‌కుడు కూడా. ప్ర‌ముఖ‌ కూచిపూడి క‌ళాకారుడిగా సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న బ‌యోపిక్ క‌థాంశాన్ని ఎంచుకున్నారా? అన్న‌ది చూడాలి. కేవ‌లం పేరు మాత్ర‌మే ఉప‌యోగించుకుని .. క‌థ‌ను పూర్తిగా క‌మ‌ర్షియ‌లైజ్ చేసుకున్నారా? అన్న‌ది హ‌రీషే చెప్పాలి.

పెద్దాయ‌న డీటెయిల్స్ ని ఆరాతీస్తే.. వీకీ ప్ర‌కారం.. వేదాంతం రాఘవయ్య (1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా.. పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం వ‌హించారు. మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు. టాలీవుడ్ ప్ర‌ముఖుడిగానూ సుప‌రిచితం. మ‌రి ఆయ‌న క‌థ‌నే హ‌రీష్ తీస్తున్నారా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News