అగ్ర నిర్మాత‌ను కాల్చిన షార్ప్ షూట‌ర్ అరెస్ట్

Update: 2020-10-11 02:30 GMT
2000 లో బాలీవుడ్ అగ్ర నిర్మాత‌ రాకేశ్ రోషన్ ను షూట్ చేసిన షార్ప్ షూట‌ర్ సునీల్ గైక్వాడ్ 3 నెలలు పెరోల్ ముగిశాక దోబూచులాట ఆడి త‌ప్పించుకు తిరుగుతూ.. ఎట్ట‌కేల‌కు ముంబై పోలీసులకు చిక్కాడు. పోలీసులు స‌ద‌రు క్రిమిన‌ల్ ని అరెస్ట్ చేశారు. రాకేశ్ రోషన్ పై దాడి చేసిన ఇద్దరు షార్ప్ ‌షూటర్లలో ఒకరైన డేంజ‌ర‌స్ క్రిమినల్ సునీల్ గైక్వాడ్ తన 28 రోజుల పెరోల్ వ్యవధిని పూర్తి చేసి జూలైలో జైలుకు తిరిగి రావలసి ఉండ‌గా..అత‌డు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్ట‌కేల‌కు అత‌డిని వేటాడి వెంటాడి శుక్రవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

 గైక్వాడ్ చివరకు ముంబయి పోలీసులు కల్వాలోని పార్సిక్ సర్కిల్ నుండి వెళుతూ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో దొరికిపోయాడు. పార్సిక్ సర్కిల్ ప్రాంతానికి గైక్వాడ్ వస్తున్నాడని పోలీసులకు సమాచారం అంద‌డంతో మాటు వేసి ప‌ట్టుకున్నారు. అతనిని పట్టుకోవటానికి పోలీస్ ఒక ప్రణాళికను రూపొందించి మూవ్ అయ్యారు. దీని గురించి  సెంట్రల్ క్రైమ్ యూనిట్ సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ హోన్రావ్ మాట్లాడుతూ,.. నిందితుడిపై 11 హత్య కేసులు ఏడు హత్యాయత్నాల కేసులు ఉన్నాయి. వీటిలో ఒకటి 2000 లో బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ రోషన్ పై చేసిన ప్రయత్నం అని వెల్ల‌డించారు.

గైక్వాడ్ ‌ను నాసిక్ సెంట్రల్ జైలులో ఉంచి హత్య కేసులో జీవిత ఖైదు విధించారు. జూన్ 26 న ప్రారంభమైన 28 రోజుల పెరోల్  కాలం పూర్తయిన తరువాత గైక్వాడ్ జైలుకు తిరిగి రాలేదు. 52 ఏళ్ల నేరస్థుడికి అలీ బుడేష్.. సుభాష్ సింగ్ ఠాకూర్ ముఠాలతో సంబంధం ఉంది. అతను నాసిక్ లో పోలీసులపై కాల్పులు జరిపాడు.

2000 జనవరిలో కుమారుడు హృతిక్ రోషన్ న‌టించిన తొలి చిత్రం కహో నా ప్యార్ హై విజయవంతం అయిన తరువాత.. దర్శకనిర్మాత‌ రాకేశ్ రోషన్ తన కారు వైపు వెళుతున్నప్పుడు అతని శాంటా క్రజ్ కార్యాలయం వెలుపల కాల్చివేత‌కు గుర‌య్యాడు. ఆరు బుల్లెట్లు దిగాయి. ఆ ఘ‌ట‌న‌లో ఇద్దరు రోషన్ ను కొట్టారు. అయితే  డ్రైవర్ అతనిని రక్షించాడు. అతను వెంట‌నే స్పందించి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు.. ఆ తరువాత నానావతి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. ఒక బుల్లెట్ రోషన్ హృదయం నుండి కేవలం ఒక మిల్లీమీటర్ దూరంలో తప్పించుకుంద‌ని వైద్యులు తెలిపారు.
Tags:    

Similar News