ఎన్టీఆర్ లో బాలయ్య కనిపించరు: సుమంత్

Update: 2018-12-01 09:40 GMT
హీరో సుమంత్ తాజా చిత్రం 'సుబ్రహ్మణ్యపురం' డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన చివరి సినిమా 'మళ్ళీరావా' తో బాక్స్ ఆఫీస్ విజయాన్ని సాధించిన సుమంత్ తన తాజా చిత్రవిజయంపై కూడా నమ్మకంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రోమోస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించిన విషయం తెలిసిందే.  ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సుమంత్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. 

'సుబ్రహ్మణ్యపురం' కాకుండా సుమంత్ ఎన్టీఆర్ బయోపిక్.. 'ఇదం జగత్' సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఎన్టీఆర్ బయోపిక్ లో తాతగారు ఎఎన్నార్ పాత్ర పోషించడం గురించి మాట్లాడుతూ తాతయ్య పాత్రలో నటించడం ఒక గొప్ప అవకాశం అన్నాడు. ఇక బాలయ్య గురించి చెబుతూ ఈ సినిమాలో ఎక్కడా బాలయ్య గారు కనిపించరని అంతా రామారావుగారే కనిపిస్తారని ఒక్క ముక్కలో తేల్చేశాడు.

టాలీవుడ్ లో ఉండే ఇతర హీరోల గురించి మాట్లాడుతూ తారక్ ను ముద్దుగా బావా అని పిలుస్తుంటానని సీక్రెట్ చెప్పాడు. ఎన్టీఆర్ ఒక బ్రిలియంట్ యాక్టర్ అని తను చేయలేని పాత్ర అంటూ లేదని అన్నాడు.  ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ తన లాంటి స్టార్ వినికిడిలోపం ఉన్న యువకుడి పాత్రను యాక్సెప్ట్ చేయడాన్ని ఎవ్వరూ నమ్మరని.. కానీ చరణ్ అలాంటి పాత్రను పోషించి అందరినీ మెప్పించాడని.. అందుకు హ్యాట్సాఫ్ అన్నాడు.   ఇక మేనమామ నాగార్జునతో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ అదో పెద్ద జోక్ అని నవ్వేస్తూ.. అలాంటి రూమర్లను అసలు పట్టించుకోనని అన్నాడు.
Tags:    

Similar News