ఫొటోటాక్‌ : సూపర్‌ స్టార్‌ కూతురు జీరో సైజ్‌ అందం

Update: 2020-11-11 15:50 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ హీరోయిన్‌ గా పరిచయం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈమె ఫిల్మ్‌ మేకింగ్‌ లో విద్య ను అభ్యసించడంతో పాటు నటనలో శిక్షణ తీసుకుంది. అతి త్వరలోనే ఈమె ఎంట్రీ ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే పేజ్‌ 3 ఫొటోలు మరియు వీడియోలతో ఈ చిన్నది ఎప్పుడు మీడియాలో ఉంటూనే ఉంది. పార్టీలు పబ్‌ ల్లో తెగ ఎంజాయ్‌ చేసే ఈ అమ్మడు ప్రస్తుతం సైజ్‌ జీరో అందాలతో ఆకట్టుకుంటు ఉంది.

తాజాగా ఈమె షేర్‌ చేసిన ఒక ఫొటోలో మరీ సన్నగా కనిపిస్తుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా సుహానా జీరో సైజ్‌ లో ఉన్నా కూడా చాలా అందంగానే కనిపిస్తుంది. వైట్‌ టాప్‌ మరియు వైట్‌ స్కట్‌ లో ఎంత వరకు చూపించాలో అంత వరకు చూపిస్తూ చాలా పద్దతిగా ఉన్న కాస్ట్యూమ్స్‌ లో సెల్ఫీ తసుకుంది. ఈ సెల్ఫీ కి షారుఖ్‌ అభిమానులు మరియు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. సుహానా ఖాన్‌ త్వరగా హీరోయిన్‌ గా పరిచయం అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈమె సినిమా మొదలు అయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News