V త‌ర్వాత సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ ప్లాన్స్

Update: 2020-08-31 06:15 GMT
టాలీవుడ్ లో టాప్ స్లాట్ పై క‌న్నేసిన హీరోల్లో మ‌హేష్ బాబు బావగారైన యువ‌న‌టుడు సుధీర్ బాబు ఉన్నారు. ద‌శాబ్ధం కెరీర్ లో ఆశించినంత పెద్ద రేంజుకు చేరుకోక‌పోయినా న‌టుడిగా ఇంప్రూవ్ మెంట్ చాలానే క‌నిపించింది. ఛాలెంజింగ్ యాక్ష‌న్ రోల్స్ కి అత‌డి ఫిట్ బాడీ యాప్ట్. అలాంటి రోల్స్ ఆఫ‌ర్ చేస్తే ప్రూవ్ చేసుకునేందుకు ఎంతో ఆస‌క్తిగా ఉంటారు సుధీర్ బాబు. త‌న‌కోసం గురువు గారు ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ అలాంటి ఛాలెంజింగ్ స్క్రిప్టునే మ‌లిచి సెట్స్ కి తీసుకెళ్లారు. అదే `వి- ది మూవీ` చిత్రం.

ఎట్ట‌కేల‌కు `వి` ఈనెల 5న ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ మూవీ పై ప్రేక్ష‌కాభిమానుల్లో భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ట్రైల‌ర్ కిక్కివ్వ‌డంతో మంచి టాక్ తో పాటు వ్యూవ‌ర్ షిప్ చ‌క్క‌ని రివ్యూల‌తో మైలేజ్ వ‌స్తుంద‌నే భావిస్తున్నారు. ఈ సినిమా అటు నానీకి.. ఇటు సుధీర్ బాబుకి చాలా ఇంపార్టెంట్. థియేట్రిక‌ల్ రిలీజ్ మిస్స‌య్యింది కాబ‌ట్టి.. క‌నీసం న‌టన ప‌రంగా.. హీరోల‌కు స్టోరీ స్క్రీన్ ప్లే ప‌రంగా ద‌ర్శ‌కుడికి బాగా చేశార‌న్న పేరొస్తే చాలు.

అన్న‌ట్టు నానీ వి త‌ర్వాత వ‌రుస క‌మిట్ మెంట్ల‌తో బిజీ. మ‌రి సుధీర్ బాబు ఏ బ్యాన‌ర్ లో చేస్తారు? అంటే ఇప్ప‌టికే ప‌లువురు వినిపించిన క‌థ‌లు విన్నారు. ఒక రెండు సినిమాలు ప‌ట్టాలెక్కాయి. V త‌ర్వాత యాత్ర నిర్మాత‌ల‌తో సుధీర్ బాబు సినిమా రాబోతోంద‌నేది తాజా అప్ డేట్.  70 ఎమ్.ఎమ్ బ్యాన‌ర్ లో ఈ మూవీ రెడీ అవుతోందట‌. క్రైమ్ కామెడీ క‌థాంశమిద‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ తో పాటు సైమ‌ల్టేనియ‌స్ గా పుల్లెల గోపీ చంద్ బ‌యోపిక్ ని సుధీర్ బాబు ప‌ట్టాలెక్కిస్తున్నారు. దీనికోసం ఇప్ప‌టికే చాలా ప్రీప్రిప‌రేష‌న్ సాగించిన సంగ‌తి విధిత‌మే.
Tags:    

Similar News