టీజర్ టాక్: అంతుచిక్కని గుడి కథ

Update: 2018-10-19 12:38 GMT
చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళి రావాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడ్డ సుమంత్ హీరోగా రూపొందిన సుబ్రమణ్యపురం టీజర్ విడుదల చేసారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ టెంపుల్ హారర్ కాన్సెప్ట్ తో రూపొందినట్టు కనిపిస్తోంది. టీజర్ లో కథను చూచాయగా చెప్పేసారు.

పురాతన ఆలయాల మీద రీసెర్చ్ చేస్తుంటాడు కార్తీక్(సుమంత్). ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచించడం అతని నైజం. గుళ్ల మీద ఇతనికి చాలా చులకన అభిప్రాయం ఉంటుంది. సుబ్రమణ్యపురంకు ఓ పెద్ద మనిషి(సురేష్)ఉంటాడు. అనుకోని అరిష్టం రావడం మూలంగా శివానందతీర్థులుని రప్పిస్తారు. కార్తీక్ ను దేవుడే పంపుతున్నాడు ఆయన చెప్పిన మాటలను బట్టి సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న హత్యలు దారుణాలు అంతు చూసేందుకు స్వయంగా కార్తీక్ పోలీసులతో కలిసి రంగంలోకి దిగుతాడు. దేవుడినే సవాల్ చేసేందుకు కూడా సిద్ధమంటూ రహస్యం కనుక్కునే ప్రయత్నం మొదలుపెడతాడు. మరి ఇందులో ఎలా విజయం సాధించాడు అనేదే సుబ్రమణ్యపురం కథగా కనిపిస్తోంది.

టీజర్ ఆకట్టుకునేలా ఉంది. గతంలో వచ్చిన కార్తికేయ లాంటి టెంపుల్ హారర్ సినిమాలు స్ఫూర్తిగా అనిపించినా సంతోష్ తనదైన మార్కు చూపించే ప్రయత్నం గట్టిగానే చేసాడు. హీరోయిన్ ఈషా రెబ్బ సురేష్ కూతురిగా అదే ఊరిలో ఉంటున్నట్టు చూపించారు. థ్రిల్ తో కావాల్సినంత సస్పెన్స్ జోడించిన ఈ మూవీ ఆ జానర్ లవర్స్ కి కనెక్ట్ అయ్యేలాగే ఉంది. మరి ఈ గుడి రహస్యం ఏంటో దాని మీద నమ్మకం లేని కార్తీక్ దాన్ని ఎలా సాధించాడో తెలియాలంటే సుబ్రమణ్యపురం వెళ్ళాలి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. సుమంత్ ఎప్పటిలాగే మంచి ఎనర్జితో ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్-ఇదం జగత్-సుబ్రమణ్యపురం ఇలా మొత్తం మూడు సినిమాలు రిలీజ్ కు లైన్ లో పెట్టేసిన సుమంత్ మళ్ళి స్పీడ్ అందుకున్నాడు

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News