SVP పోస్టర్: కళావతి ప్రేమ పరవశంలో మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''సర్కారు వారి పాట''. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - స్పెషల్ పోస్టర్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెడుతున్న మేకర్స్.. ఇటీవల ప్రకటించినట్లుగా ఫస్ట్ సింగిల్ 'కళావతి' ని ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'కళావతి' అనేది ఈ సంవత్సరపు క్లాసికల్ మెలోడీ అవుతుందని.. మీ హృదయాన్ని కదిలిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఇది మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని చూపుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఈ పాటకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు.
ఇందులో మహేష్ బాబు కూల్ అండ్ స్టైలిష్ గా.. నిజంగా ప్రిన్స్ లా కనిపిస్తున్నారు. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతూ.. కీర్తి సురేష్ భుజంపై వాలిపోయి ఉన్నారు. కీర్తి క్యూట్ స్మైల్ తో గోల్డ్ కలర్ చీరలో మెరిసిపోతోంది. మరో ఐదు రోజుల్లో రాబోతున్న 'కళావతి' మ్యాజికల్ నంబర్ తో శ్రోతలు కచ్చితంగా ప్రేమలో పడతారని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఎస్ ఎస్ థమన్ 'సర్కారు వారి పాట' చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
మహేష్ బాబుని మునుపెన్నడూ చూడని స్టైలిష్ అవతార్ లో ప్రెజెంట్ చేస్తున్నారు పరశురామ్. సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్. మది ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 12వ తేదీన 'సర్కారు వారి పాట' సినిమా విడుదల కానుంది.