స్టార్ హీరోయిన్ ని ఫ్రెండుతో ప‌డుకోమ‌న్న భ‌ర్త‌!?

Update: 2020-12-30 07:17 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల్లోలం గురించి తెలిసిన‌దే. ద‌శాబ్ధం పైగా అగ్ర క‌థానాయిక‌గా బాలీవుడ్ లో గొప్ప స్టార్‌డమ్‌ను ఆస్వాదించినా వైవాహిక జీవితం విఫ‌ల‌మైంది. బిజినెస్ మేన్ కం నిర్మాత‌ సంజయ్ కపూర్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం తలక్రిందులైంది. ఆమె 2016 లో తన 13 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని చివరికి ముగించింది. వారిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. విడాకులు తీసుకున్న దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత కరిష్మా కపూర్ గృహ హింస స‌హా త‌న జీవితంలో అనేక షాకింగ్ సంఘటనల గురించి మీడియాకి ఓపెన‌య్యారు. ఆ ఇంట‌ర్వ్యూనే భ‌ర్త నుంచి విడిపోయేందుకు కార‌ణ‌మైంది.

వివాహం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని.. పెళ్లి ప్రతిరోజూ ఆమె బాధపడేలా చేసిందని కరిష్మా వెల్లడించింది. తన హనీమూన్ రోజు చెత్త జ్ఞాపకాలలో ఒకటి అని కరిష్మా అన్నారు. పెళ్ల‌యిన వెంటనే సంజయ్ ఆమెను హింసించడం ప్రారంభించాడు. అతను కరిష్మాను తన స్నేహితులలో ఒకరితో కలిసి నిద్రించమని బలవంతం చేశాడ‌ట‌. తాను నిరాకరించడంతో సంజయ్ కొట్టాడ‌ని ఆరోపించారు క‌రిష్మా. హ‌నీమూన్ లో త‌న‌ను వేలం వేసి తన స్నేహితులకు ధ‌ర‌ను కోట్ చేశాడని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

కరిష్మాతో వివాహం అయిన తరువాత కూడా సుంజయ్ తన మొదటి భార్యతో శారీరక సంబంధం కొనసాగించాడని కరిష్మా చెప్పారు. కరిష్మా అతనిని ఎదుర్కోవడానికి ప్రయత్నించినప్పుడు సుంజయ్ ఆమెపై మరింత దాడి చేశాడు. సంజయ్ మాత్రమే కాదు... అతని తల్లి కూడా  చాలా సార్లు కరిష్మాపై దాడి చేశార‌ని క‌రిష్మా ఆరోపించారు.

గర్భధారణ సమయంలో అత్తగారు బహుమతిగా ఇచ్చిన దుస్తులు ధరించక‌పోవ‌డంతో తీవ్రంగా హింసించారని దాడి చేశార‌ని క‌రిష్మా చెప్పారు. ఇన్ని సంవత్సరాలు ఇంత జ‌రిగాక కరిష్మా కపూర్ చివరకు సంజయ్ కపూర్ నుండి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. 2012 లో విడివిడిగా జీవించడం ప్రారంభించారు. కరిష్మా కపూర్ ‌-సంజయ్ కపూర్ జంట‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు తమ తల్లితో నివసిస్తున్నారు. సంజయ్ కపూర్ తరువాత ప్రియా సచ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు.
Tags:    

Similar News