• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి 2020 బరిలో...

సంక్రాంతి 2020 బరిలో స్టార్ల కొట్లాట

By - Tupaki Desk
Update: 2019-08-08 06:04 GMT
నిజంగానే వచ్చే ఏడాది సంక్రాంతి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ని తలపించేలా ఉంది. ప్రతి సంవత్సరం మొత్తం మీద సంక్రాంతే అతి పెద్ద సీజన్ కావడంతో పోటీని లెక్క చేయకుండా మరీ నిర్మాతలు కోట్లాది రూపాయల తమ పెట్టుబడిని పందెంగా పెడుతుంటారు. సినిమా ఎలా ఉన్నా మినిమమ్ గ్యారెంటీ వసూళ్లు వస్తాయనే ధీమా వాళ్ళను ఇలా కవ్విస్తోంది. అందుకే వినయ విధేయ రామ అంత డిజాస్టర్ అయినప్పటికీ 60 కోట్లకు పైగా వసూళ్లు రావడంలో అంతరార్థం అదే.

ఇక వచ్చే సంక్రాంతి గడిచిపోయిన 2019కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనే స్థాయిలో స్టార్ల కోడి పందేలకు  రెడీ అవుతోంది. ఇప్పటికి రెండు మూడు కన్ఫర్మ్ గా వస్తాయని తెలుస్తున్నప్పటికీ ఆ సమయానికి చాలా మార్పులు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఈ రేస్ లో ఎలాంటి డౌట్లు రేపకుండా పక్కా ప్లానింగ్ తో ఉంది. దిల్ రాజు - అనిల్ రావిపూడి కాంబినేషన్ కాబట్టి లేట్ కాకుండా జాగ్రత్త పడతారనే టాక్ ఉంది. ఇక అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న మూవీ కూడా సంక్రాంతి నే టార్గెట్ చేసుకుని ఆ మేరకు ప్రకటన ఇచ్చేశారు. ఊహించని విధంగా శర్వానంద్ శ్రీకారం కూడా రేస్ లోకి రావడం మరో ట్విస్ట్. ఇంత పోటీ ఉందని తెలిసినా ధైర్యంగా సిద్ధపడటం చూస్తే శ్రీకారం కంటెంట్ మాములుగా లేనట్టేగా.

ఇక రజనీకాంత్ దర్బార్ కూడా సై అంటోంది. అఫీషియల్ నోట్ రాలేదు కానీ ఇదీ ఫిక్స్ అయినట్టే. అసలు షూటింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి బాలకృష్ణ-రవికుమార్ సినిమా లేనట్టే. జనవరి 9 నుంచి జనవరి 15 దాకా పైన  చెప్పినవి షెడ్యూల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకో నెల రెండు నెలల్లో డేట్లతో సహా ప్రకటనలు  వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు పూర్తి క్లారిటీ ఉంటుంది. చూద్దాం.
    
    

Tags:    
  • Sarileru Nekevvaru 
  • Darbar 
  • Srikaram 
  • Allu Arjun 
  • Latest News 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS