బుల్లితెర బెటరనుకుంటున్న స్టార్లు

Update: 2019-09-02 17:30 GMT
ఏమో ట్రెండ్ చూస్తే అలాగే కనిపిస్తోంది. చిన్నా మొదలుకుని పెద్ద దాకా హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరూ బుల్లి తెరవైపు ఒ ట్రయిల్ వేయడం చూస్తే రిస్క్ పరంగా సేఫ్ గా అనిపించే టీవీ వైపే మొగ్గు చూపుతున్నారన్న సందేహం కలుగుతుంది. ఇప్పటిదాకా చిన్నితెరపై తమ చార్మ్ ని చూపించిన హీరోల్లో చిరంజీవి - నాగార్జున - నాని - జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ రేంజ్ కు తగ్గట్టుగా ఆయా రియాలిటీ షోలను రక్తికట్టించారు.

సీనియర్ నటిగా డిమాండ్ పీక్స్ లో ఉన్న రమ్యకృష్ణ సైతం బిగ్ బాస్ 3 కు టెంపరరీ యాంకర్ గా మారడం ఇలాంటి ప్రోగ్రాంస్ పట్ల వాళ్ళకున్న ఆసక్తిని బయట పెడుతోంది. అయితే వీళ్ళందరికీ ఛాన్సులు లేవని కాదు. కెరీర్ డౌన్ అయ్యిందని కాదు. పీక్స్ లో ఉన్నప్పటికీ ఏదో ఓ ప్రయత్నం చేయడంలో భాగమే. మహేష్ బాబు సైతం యాడ్స్ లో ఎక్కువ కనిపించడానికి కారణం ఇదే అని చెప్పొచ్చు.

సినిమాలు ఎలాగూ ఏడాదికి ఒకటి మించి చేసే ఛాన్స్ దొరకడం లేదు. యాడ్స్ రూపంలోనైనా కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కు ఎంత కొంత ఊరట దక్కుతుంది. జబర్దస్త్ షోకు జడ్జ్ లుగా ఉండటం తమకెంత పేరు తెచ్చిందో మర్చిపోని రోజా నాగబాబులు ఇప్పటికీ దాని న్యాయ నిర్ణేతలుగా కొనసాగడం మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు స్టార్ అంటే కేవలం బిగ్ స్క్రీన్ మీదే కనిపిస్తారు అనే కాన్సెప్ట్ ని బ్రేక్ చేసి వీళ్ళంతా బుల్లితెరవైపు మళ్ళడం ఎంతైనా శుభపరిణామమే


Tags:    

Similar News