‘శ్రీమంతుడ్ని’ అండ్ కోను కోర్టుకు రమ్మన్నారు

Update: 2017-01-24 17:11 GMT
ఆ మధ్య విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన శ్రీమంతుడి సినిమాకు సంబంధించిన వివాదం ప్రముఖ హీరో మహేశ్ బాబుకు తలనొప్పిగా మారినట్లే. శ్రీమంతుడు సినిమా కథ తనదేనని.. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఒక వారపత్రికలో 2012లో తాను రాసిన సీరియల్ నే కాపీ కొట్టి సినిమా తీశారన్నది అతగాడి ఆరోపణ.

తాను రాసిన ‘‘చచ్చేంత ప్రేమ’’ సీరియస్ లో కాపీ చేశారని.. తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టును కోరారు. రచయిత చేసిన ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజాగా సినిమా హీరో మహేశ్ బాబుకు..చిత్ర దర్శకుడు కొరటాల శివ..ఏర్నేని నవీన్ లను కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రచయిత చేసిన ప్రైవేటు ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై ఐపీసీ 120బీ.. కాపీరైట్ యాక్ట్ లోని సెక్షన్ 63 కింద కోర్టు కేసు నమోదు చేసి.. శ్రీమంతుడు అండ్ కోలను కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది.


Tags:    

Similar News